29, అక్టోబర్ 2011, శనివారం

అవినీతి పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు....ఫోటోలు

అవినీతి పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు....ఫోటోలు

కార్పొరేట్ సంస్థల దురాశకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వస్తున్నారు. శనివారం దాదాపు 80 దేశాల్లోని 950 నగరాల్లో వీరు కదం తొక్కారు. యూరప్, ఆసియా, అమెరికాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కార్పొరేట్ దురాశ, ఆర్థిక- సామాజిక అంతరాలకు వ్యతిరేకంగా అమెరికాలోని న్యూయార్క్‌లో నెలక్రితం ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’(వాల్ స్ట్రీట్‌ను ఆక్రమించండి) పేరుతో నిరసన ప్రదర్శనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవి క్రమంగా ప్రపంచమంతా వ్యాప్తిస్తున్నాయి. సిడ్నీ, టోక్యో, బెర్లిన్, మాడ్రిడ్, లిస్బన్, హాంకాంగ్, టొరాంటో నగరాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి