21, అక్టోబర్ 2011, శుక్రవారం

గడాఫీ చుట్టూ అందమైన అమ్మాయిలు.. కింద 143 టన్నుల బంగారం

గడాఫీ చుట్టూ అందమైన అమ్మాయిలు.. కింద 143 టన్నుల బంగారం
శుక్రవారం, 21 అక్టోబర్ 2011( 19:33 IST )
గడాఫీ బతికున్నంత కాలం అతడి వ్యక్తిగత జీవితం గురించి బయటి ప్రపంచానికి ఒక్క ముక్క కూడా వెల్లడి కాలేదు. కానీ హతమయ్యాక గంటకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. వీటిలో తాజా అంశం ఏంటయా అంటే... గడాఫీ అంగరక్షకులు సంగతి.

గడాఫీ ఓ పట్టాన మగపురుగులను నమ్మేవాడు కాదట. అందుకే తన అంగరక్షకులుగా స్త్రీలను నియమించుకునేవాడట. అందునా పెళ్లికాని కన్యలకే స్థానమట. అలా నియమించుకుని ఊరుకునేవాడు కాదట. వారు అలంకరణకు ప్రధమ ప్రాధాన్యమిచ్చేవాడట.

తన చుట్టూ భద్రతగా ఉన్న అమ్మాయిల పెదాలకు లిప్‌స్టిక్, ముఖానికి మేకప్, గోళ్లకు రంగు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయట. తనకు బాగా నచ్చిన సుందరాంగులనే రక్షణగా పెట్టుకునేవాడట. వీరిని నమ్మినంతగా మరెవర్నీ నమ్మేవాడు కాదట గడాఫీ. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తర్వాత కూడా గురుడు ఈ అమ్మాయిల వలయంలోనే గడిపాడని లిబియన్ వర్గాలు చెపుతున్నాయి.

ఇదిలావుంటే గడాఫీకి బంగారమంటే మహాపిచ్చట. అతడు సుమారు 143 టన్నుల బంగారాన్ని వెనకేసినట్లు తాజాగా వెలుగుచూసింది. ఇపుడీ బంగారమంతా ఆయా బ్యాంకుల్లో ఉన్నదట. గడాఫీ హతమవ్వడంతో ఈ బంగారాన్ని అమ్మేసి లిబియా దేశాభివృద్ధికి వినియోగించాలని చూస్తున్నారట. ప్రస్తుతం బంగారం ధర చుక్కలను చూస్తుండటంతో క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారట అధికారులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి