తిరుమల, ఏప్రిల్ 16 : తిరుమల వేంకటేశ్వరుడికి మంతెన రామలింగరాజు అనే
భక్తుడు రూ.16 కోట్ల విరాళం సమర్పించారు. అమెరికాకు చెందిన
పారిశ్రామికవేత్త అయిన ఆయన.. మంగళవారం ఉదయం స్వామిని దర్శించుకున్నారు.
టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో శ్రీనివాసరాజు తదితరుల సమక్షంలో ఈ
విరాళాన్ని అందించారు. ఆయన అందించిన విరాళంలో రూ.11 కోట్లతో శ్రీవారికి 35
కిలోల బంగారం కొంటామని బాపిరాజు మీడియాకు తెలిపారు.
రామలింగరాజు కోరిక మేరకు ఆ బంగారంతో శ్రీవారికి అదనంగా సహస్ర నామ మాల తయారు చేయిస్తామన్నారు. మిగిలిన రూ.5 కోట్లను తిరుచానూరులోని అన్నప్రసాద భవన నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారు. శ్రీవారి పాదాల చెంత ధ్యానమందిర నిర్మాణానికి మరో రూ.65 లక్షల విరాళం ఇవ్వడానికి రామలింగరాజు అంగీకరించారని బాపిరాజు చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి