14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

జనంపై కేంద్రం ఆయిల్ భారం

 

  • లీటర్ డీజిల్ ధర రూ. 5  పెంపు  
  • హైదరాబాద్ లో రూ 5.70 పైసల హైక్
  • హైదరాబాద్ లో లీటర్ యాబై దాటనున్న డీజిల్
  • అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు
  • ఏడాదికి ఆరు సిలిండర్లకే సబ్సిడీ
  • ఆరు దాటితే సిలిండర్ రేట్ రూ . 750
  • నిత్యావసరాలపైనా డీజిల్ ధరల పెంపు ప్రభావం
  • రవాణా ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం
సామాన్యునికి డీజిల్ సెగ తగిలింది. యూపీఏ సర్కార్ మరోసారి జనానికి పెట్రోవాత పెట్టింది. ఐతే.. ఈసారి డీజిల్ రూపంలో ప్రజలకు చుక్కలు చూపించింది. లీటరుకు ఏకంగా ఐదు రూపాయలు పెంచింది. దీంతో కామన్ మ్యాన్ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అలాగే ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే సబ్సిడీపై ఇవ్వాలని మన్మోహన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

మరోసారి సామాన్యులపై యుపిఎ ప్రభుత్వం విరుచుకుపడింది. డీజిల్ ధరను భారీగా పెంచి ఆమ్ ఆద్మీ నడ్డి విరిచింది. డీజిల్ ధరను లీటరుకు ఏకంగా 5 రూపాయలు పెంచింది. ఐతే.. కిరోసిన్, పెట్రోల్ ధరల జోలికి మాత్రం పోలేదు. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ కంపెనీలకు ప్రతి రోజు 550 కోట్ల నష్టం వాటిల్లుతోంది. డీజిల్ అమ్మకంపై లీటరుకు 19 రూపాయల నష్టం వస్తుండగా, కిరోసిన్‌పై లీటరుకు రూ.32.7, సిలిండర్‌కు 347 రూపాయల చొప్పున ప్రతి రోజూ నష్టం వస్తోంది. దీంతో  ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులపై బండలాంటి నిర్ణయాన్ని పడేసింది. ఇక నుంచి ఏడాదికి సబ్సిడీపై కుటుంబానికి కేవలం 6 సిలిండర్లు మాత్రమే ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ 6 సిలిండర్లకు మించితేబహిరంగ మార్కెట్ ధర.. అంటే 750 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీజిల్ లీటరుకు 5 మేరకు పెంచడంతో ఈ ప్రభావం ఆర్టీసీ, రైల్వే, నిత్యావసర వస్తువులు... ఇలా సామాన్య జనానికి అవసరమయ్యే చాలా వాటి ధరలు అనూహ్యంగా పెరిగే పరిస్తితి ఏర్పడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి