11, సెప్టెంబర్ 2012, మంగళవారం

దేశంలోని పొలిటికల్‌ పార్టీలకు భారీగా విరాళాలు

  • వెల్లడించిన అసోషియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌-ADR
  • ఏడేళ్లలో పార్టీలకు రూ.4,662కోట్ల డొనేషన్లు
  • డొనేషన్లలో ముందున్న 'ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌'
  • 2004-2011మధ్య కాంగ్రెస్‌కు రూ.2,008కోట్లు
  • రూ.994కోట్లతో రెండోస్థానంలో బీజేపీ
  • బీఎస్పీకి రూ.484కోట్లు.. సీపీఎంకు రూ.417కోట్ల విరాళాలు
  • కార్పొరేట్స్‌ నుంచి పార్టీలకు భూరివిరాళం
  • అన్ని పార్టీలకు డొనేషన్లు ఇస్తున్న కంపెనీలు
  • రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ యాక్ట్‌-1951
  • కాంగ్రెస్‌ 11.89%, బీజేపీ 22.76% విరాళాలు బహిర్గతం
  • టీఆర్‌ఎస్‌ డొనేషన్లలో 99.98శాతం పారదర్శకత
  • 85శాతం విరాళాలకు లెక్కాపత్రాలు లేవు
  • బ్లాక్‌మనీ పార్టీలకు చేరుతోందనే విమర్శలు
ఇండియా పేద దేశమేమో కాని.. ఇక్కడి పొలిటికల్‌ పార్టీలు మాత్రం చాలా రిచ్‌ అంటోంది అసోషియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ అనే ఎన్జీవో. ఈ సంస్థ తాజాగా రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌లో.. దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే నిజాలు వెల్లడయ్యాయి. జాతీయ, ప్రాంతీయ అనే తేడా లేకుండా.. దేశంలోని రాజకీయ పార్టీలన్నిటికీ భారీగా విరాళాలు వచ్చిపడుతున్నాయి. అయితే, డొనేషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిస్తున్నారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో... బ్లాక్‌ మనీ పార్టీలకు చేరుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వృద్ధి రేటు తగ్గటం, ఆర్థిక మాంద్యం, వాణిజ్యం కుంటుపడటం.. లాంటివన్నీ రాజకీయ పార్టీల డొనేషన్ల విషయానికి వచ్చే సరికి పత్తా లేకుండా పోయాయి. గడిచిన ఏడేళ్లలో దేశంలోని 23 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు... ఏకంగా 4వేల 662 కోట్ల విరాళాలు వచ్చాయి. దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్‌ పార్టీ డొనేషన్ల విషయంలో మిగతా పార్టీలకు అందనంత ఎత్తులో ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కి... 2004లో 222కోట్ల విరాళాలు రాగా, 2011నాటికి డొనేషన్లు 307కోట్లకు చేరాయి. 2004 నుంచి 2011మధ్య కాంగ్రెస్‌ ఖాతాలోకి.. 2వేల 8 కోట్లు వచ్చిపడ్డాయి. కూపన్ల రూపంలో కాంగ్రెస్‌పార్టీ అధిక మొత్తంలో డొనేషన్లు కలెక్ట్‌ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ప్రతిపక్ష బీజేపీ 994 కోట్ల విరాళాలతో నెంబర్‌ టూ ప్లేస్‌ ఆక్రమించింది. మాయావతి పార్టీకి... 484కోట్ల డొనేషన్లు అందాయి. కమ్యునిస్టు పార్టీలూ విరాళాల విషయంలో ఒకడుగు ముందే ఉన్నాయి. సీపీఎంకు 417 కోట్ల డొనేషన్లు రాగా.. సీపీఐ మాత్రం కాస్త వెనకబడింది.పొలిటికల్‌ పార్టీలకు డొనేషన్స్‌ ఇచ్చే విషయంలో కార్పొరేట్ సంస్థలు ముందున్నాయి. అయితే విచిత్రంగా.. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా...  దాదాపు అన్ని పార్టీలకూ భారీగా విరాళాలు ముట్టజెప్పుతున్నాయి. ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన జనరల్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ గత ఏడేళ్లలో...  కాంగ్రెస్‌కు 36 కోట్లు విరాళంగా ఇవ్వగా, బీజేపీకి 26 కోట్లు డొనేట్‌ చేసింది. టాటాలకు చెందిన ఎలక్టోరల్‌ ట్రస్ట్‌, టొరెంట్‌ పవర్‌, వీడియోకాన్‌, ఐటీసీ, వేదాంత గ్రూప్‌, అదాని గ్రూప్‌, మహింద్రా అండ్‌ మహింద్రా.. లాంటి బడా కార్పొరేట్‌ కంపెనీలు... పార్టీల ఖజానాలను నింపుతున్నాయి.

రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1951 ప్రకారం 20వేలకు పైగా డొనేషన్‌ వస్తే వాటి ఫుల్‌ డిటేల్స్‌ వెల్లడించాలి. కాని వాస్తవంలో అలాంటిదేమీ మచ్చుకైనా కన్పించడం లేదు. కాంగ్రెస్‌ 11.89శాతం, బీజేపీ 22.76శాతం విరాళాల వివరాలు బహిర్గతం చేస్తుంటే.. దేశంలోనే అత్యధికంగా.. మన రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ 99.98శాతం పారదర్శకత ప్రదర్శిస్తోంది.అయితే, పార్టీలకు అందుతున్న డొనేషన్లలో 85శాతం అన్‌నోన్‌ పర్సన్స్‌ నుంచే రావడం విమర్శలకు తావిస్తోంది. ఎలాంటి లెక్కాపత్రాలు ఉండవు. పారదర్శకత భూతద్దం వేసినా మచ్చుకైనా కన్పించదు. విరాళాల వ్యవహారం పూర్తిగా రహస్యంగా సాగుతోంది. దీంతో దేశంలోని బ్లాక్‌మనీ.. డొనేషన్ల రూపంలో పార్టీలకే చేరుతోందనే వాదన తెరపైకొస్తోంది. 

Politics pays: Congress earned Rs 2,008 cr in last 7 years, BJP is richer by Rs 994 crore. A break-up of earnings of top political parties.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి