5, సెప్టెంబర్ 2012, బుధవారం

సైబర్ మాయ!



- ఏస్‌బీహెచ్ ఖాతాల నుంచి డబ్బులు మాయం
- ఏన్కూర్ ఖాతా నుంచి రూ. 65వేలు పాట్నాలో డ్రా
- ఖమ్మం జిల్లాలో వరుస ఘటనలు

ఏన్కూర్, సెప్టెంబర్ 3 (టీమీడియా): ఏటీఎం కార్డుల క్లోనింగ్ ఖమ్మం జిల్లాను కుదిపేస్తోంది. గతంలో రెండు ఘటనల్లోనూ ఎస్‌బీహెచ్‌కు చెందిన ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయి. ఇక్కడి ఖాతాలకు సంబంధించిన డబ్బులు దేశ రాజధాని ఢిల్లీ, బీహార్ రాజధాని పాట్నాలో విత్ డ్రా అవుతున్నాయి. తాజాగా మరో ఉదంతం బయటపడింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు గురుకుల పాఠశాలలో సీ రాధారాణి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఏస్కూర్ ఎస్‌బీహెచ్‌లో ఖాతా ఉంది. ఒకటో తేదీ న ఏరియర్స్,జీతం కలిపి మొత్తం రూ.77,650 ఖాతాలో జమయ్యాయి. అదే రోజు మధ్యాహ్నం ఖమ్మంలోని ఐడీబీఐ ఏటీఎం నుంచి ఆమె రూ.15వేలు డ్రా చేశారు. మరుసటి రోజు ఏటీఎంకు వెళ్లగా..రూ.65వేలు ఎవరో డ్రా చేసినట్లుగా మినీస్టేట్‌మెంట్ వచ్చింది.

ఆందోళన చెందిన బాధితురాలు సోమవారం బ్యాంకులో సంప్రదించగా పాట్నాలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బు డ్రా అయినట్లుగా గుర్తించారు. మూడు రోజుల కిం దట కూడా బూర్గంపాడుకు చెందిన ఓ ఉపాధ్యాయురాలి ఖాతా నుంచి రూ.లక్ష ఇలాగే మాయమైంది. గతంలో పాల్వంచ, వైరాకు చెందిన ఖాతాల నుంచి కూడా ఢిల్లీలో లక్షల్లో డబ్బు డ్రా అయినట్లు గుర్తించి..బాధితులకు చెల్లించారు. హఠాత్తుగా డబ్బు మాయమవుతుండడంతో ఖాతాదారులు భయపడుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి