5, సెప్టెంబర్ 2012, బుధవారం

బెయిల్ డీల్ 20 కోట్లు

బెయిల్ డీల్ @20 కోట్లు
 -yada0 talangana patrika telangana culture telangana politics telangana cinema పట్టాభి, చలపతిరావుకు తలో ఐదు కోట్లు
- తనకు, హైకోర్టు ఖర్చులకు మిగతా సొమ్ము
- గాలికి బెయిల్ కేసులో గుట్టువిప్పిన రౌడీషీటర్ యాదగిరి

హైదరాబాద్, జూలై 10 (టీ మీడియా): మైనింగ్ మాఫియా అధినేత గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు అక్షరాల రూ.20 కోట్ల విలువ చేసే ఒప్పందం కుదిరింది!! రోజుకో సంచలనం సృష్టిస్తున్న బెయిల్ ఫర్ సేల్ కేసులో అరెస్టయిన రౌడీషీటర్ యాదగిరిరావు తన నేరాంగీకారంలో వెల్లడించిన వాస్తవమిది. ఈ 20 కోట్లలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా పనిచేసిన పట్టాభి రామారావు, రిటైర్డ్ జడ్జి వెంకట చలపతిరావుకు తలో ఐదు కోట్లు ఇవ్వాలని, తన వాటాగా ఐదు కోట్లు ఉంచుకొని, మిగతా ఐదు కోట్ల రూపాయలను హైకోర్టు ఖర్చులకు వాడాలని ఒప్పందం కుదిరినట్లు తెలిపాడు.

దీని ప్రకారం ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ మంజూరు కాగానే అతని సోదరుడు సోమశేఖరడ్డి మొదట రూ. 4.5 కోట్లు ఇచ్చాడని, ఆ తరువాత దశలవారీగా మరో ఐదు కోట్ల రూపాయలను తనకు పంపాడని వివరించాడు. బెయిల్ ఫర్ సేల్ వ్యవహారం వెలుగుచూడగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన యాదగిరిరావును ఇటీవల ఏసీబీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల రెండో తేదీన ఏసీబీ అధికారులు యాదగిరిరావు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అతని నేరాంగీకారం వివరాలు ఇలా ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ నేపథ్యంలో
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో తనకు పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులతో పరిచయాలు ఉన్నట్టుగా యాదగిరిరావు తన నేరాంగీకారంలో వెల్లడించాడు. న్యాయవాది ఉమామహేశ్వరరావుతోపాటు ఆయన వద్ద జూనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్న ఆదిత్య తనకు ఆరేళ్లుగా తెలుసని చెప్పాడు. వికారాబాద్ ఓఎస్‌డీగా పనిచేసిన సర్వేశ్వర్‌డ్డి.. రంగాడ్డి జిల్లా స్పెషల్‌వూబాంచ్‌లో ఎస్‌ఐగా ఉన్నప్పటినుంచి తనకు పరిచయమని వెల్లడించాడు. 2011, నవంబర్‌లో అన్సారీ అనే న్యాయవాది ఇచ్చిన విందులో తనకు రిటైర్డ్ జడ్జి వెంకట చలపతిరావు పరిచయమైనట్టు తెలిపాడు. ఈ క్రమంలో రెండుమూడుసార్లు ఆయన తన ఇంటికి కూడా వచ్చి వెళ్లాడని చెప్పాడు. 2011, డిసెంబర్ మొదటివారంలో చలపతిరావు ద్వారా అప్పట్లో ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉన్న పట్టాభి రామారావును ఒప్పించి పోలీసు అధికారి సర్వేశ్వర్‌డ్డికి బెయిల్ ఇప్పించినట్టు వెల్లడించాడు. ఈ పనిచేసి పెట్టినందుకు పట్టాభికి పది లక్షలు, చలపతిరావుకు మరో లక్ష రూపాయలు చెల్లించినట్టు స్పష్టంచేశాడు.

సోమశేఖరడ్డిని కలిసేందుకు రవిచంద్ర సంకోచం
శాంతినగర్‌లో ఉన్న న్యాయవాది ఉమామహేశ్వరరావు ఆఫీస్‌కు తాను తరచూ వెళ్లేవాడినని అప్పుడే ఉమామహేశ్వరరావు వద్ద జూనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్న ఆదిత్య తనకు గాలి జనార్దన్‌డ్డి సోదరుడు సోమశేఖరడ్డి, బంధువు దశరథరాండ్డిలను పరిచయం చేశాడని యాదగిరిరావు వెల్లడించాడు. మే 1, 2 తేదీల్లో తాను గాలి, దశరథరాండ్డిని న్యాయవాది ఉమామహేశ్వరరావు ఆఫీస్‌లో కలిశానని, అప్పట్లో సీబీఐ ప్రత్యేక జడ్జిగా ఉన్న పట్టాభి రామారావు ద్వారా గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించగలరా? అని వారు తనను ప్రశ్నించారని చెప్పాడు. రిటైర్డ్ జడ్జి చలపతిరావు తనకు తెలుసని, అతనిద్వారా పని పూర్తిచేయించుకోవచ్చని వారితో చెప్పినట్టు వెల్లడించాడు.

ఇందుకు వారు అంగీకరించడంతో ఆ వెంటనే తాను చలపతిరావును కలిశానని, గాలికి బెయిల్ ఇప్పిస్తే చాలా పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని చెప్పి అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. దీనికి చలపతిరావు పట్టాభితో మాట్లాడి విషయం చెబుతానన్నాడని వివరించాడు. మే 6న గాలి బెయిల్ విషయమై చలపతిరావుతో మాట్లాడగా తాను అప్పటికే పట్టాభితో మాట్లాడానని, బెయిల్ ఇవ్వటానికి పట్టాభి సుముఖంగా ఉన్నాడని తనకు తెలిపినట్లు చెప్పాడు. చలపతిరావు దీనికోసం ఐదుకోట్లు ఇవ్వాల్సి ఉంటుందని తనతో చెప్పినట్టు యాదగిరిరావు తెలిపాడు. అదే రోజు సాయంత్రం సోమశేఖరడ్డి, దశరథరాండ్డిలను కలిసి బెయిల్ ఇవ్వటానికి పట్టాభి సుముఖంగా ఉన్న విషయాన్ని వారికి చెప్పినట్టు పేర్కొన్నాడు.

అనంతరం విషయాన్ని అడ్వకేట్ ఆదిత్యతో చెప్పానన్నాడు. దీనిపై ఆదిత్య మాట్లాడుతూ విషయాన్ని తాను కూడా తన సీనియర్‌గా ఉన్న న్యాయవాది ఉమామహేశ్వరరావుతో చెప్పానని, ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించాడని తెలియచేశాడు. మే 9న సోమశేఖరడ్డితో మాట్లాడగా గాలికి బెయిల్ ఇస్తే పట్టాభికి ఐదు కోట్లు, చలపతిరావుకు ఐదు కోట్లు, తనకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వటానికి అతను అంగీకరించాడని యాదగిరిరావు స్పష్టంచేశాడు. దాంతోపాటు హైకోర్టు ఖర్చుల కింద మరో ఐదు కోట్ల రూపాయలు ఇస్తానని కూడా సోమశేఖరడ్డి తనతో చెప్పినట్టు తెలిపాడు. పట్టాభి బెయిల్ మంజూరు చేస్తాడన్న నమ్మకాన్ని తమకు కల్పించాల్సి ఉంటుందని సోమశేఖరడ్డి షరతు విధించినట్టు వివరించాడు.

అదే రోజు రాత్రి చలపతిరావును కలిసి సోమశేఖరడ్డి విధించిన షరతు గురించి చెప్పానని, దానిపై పట్టాభి కుమారుడు రవిచంవూదను మాసాబ్‌ట్యాంక్ ప్రాంతంలో కలిపిస్తానని అతను తనతో చెప్పాడని యాదగిరిరావు వివరించాడు. ఆ మరుసటిరోజు రాత్రి 9 గంటలకు సోమశేఖరడ్డి, దశరథరాండ్డి, ఆదిత్య తదితరులు అక్కడికి వచ్చారని, అప్పటికే అక్కడ కారులో ఉన్న చలపతిరావు.. తనతో పాటు ఉన్న పట్టాభి కుమారుడు రవిచంద్రను పరిచయం చేశాడని వివరించాడు. మొదట సోమశేఖరడ్డిని కలవటానికి రవిచంద్ర ఒప్పుకున్నా ఇప్పుడు అందుకు సంకోచిస్తున్నట్టు అతను చెప్పాడని తెలిపాడు. దీనిపై సోమశేఖరడ్డి స్పందిస్తూ బెయిల్ వస్తుందన్న నమ్మకం కుదిరిందని, అయితే బెయిల్ మంజూరైన తరువాత రూ.10 కోట్లు, బెయిల్ ఆర్డర్ అందిన తరువాత మరో 10 కోట్లు ఇస్తానని తనతో చెప్పినట్టు యాదగిరి వెల్లడించాడు.

డీల్ ప్రకారమే బెయిల్
తమ మధ్య కుదిరిన డీల్ ప్రకారం మే 11న పట్టాభి రామారావు ఓఎంసీ కేసులో అరెస్టయిన గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ మంజూరు చేసినట్టుగా యాదగిరిరావు నేరాంగీకారంలో తెలిపాడు. ఆ రోజున తాను, సోమశేఖరడ్డి, మరికొందరు శాంతినగర్‌లో ఉన్నామని, ఫోన్ల ద్వారా చలపతిరావు, ఆదిత్యతో మాట్లాడుతూనే ఉన్నామని వివరించాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆదిత్య ఫోన్ చేసి గాలికి బెయిల్ మంజూరైన విషయాన్ని తనతో చెప్పగా ఆ వెంటనే తాను సోమశేఖరడ్డికి తెలియచేశానన్నాడు.

ఆ రోజు రాత్రి దస్పల్లా హోటల్‌లో సోమశేఖరడ్డిని కలిశానని, అక్కడ తనకు అతను రూ. 4.5 కోట్లు ఉన్న తొమ్మిది బ్యాగులను ఇచ్చాడని వివరించాడు. బెయిల్ ఆర్డర్ కాపీ చూసిన తరువాత మిగతా డబ్బు ఇస్తానని చెప్పాడన్నాడు. అక్కడి నుంచి నేరుగా చలపతిరావు ఇంటికి వెళ్లిన తాను తన డ్రైవర్ రవి ద్వారా రూ. మూడు కోట్లు అతనికి అందజేసినట్టు తెలియచేశాడు. ఆ మరుసటిరోజు ఉదయం చలపతిరావు మిగతా డబ్బు కోసం పలుమార్లు తనకు ఫోన్ చేయగా తాను సోమశేఖరడ్డితో మాట్లాడానన్నాడు. ఈ క్రమంలో సోమశేఖరడ్డి తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చైతన్య ద్వారా కోటి రూపాయలను తన ఇంటికి పంపించినట్టు యాదగిరిరావు వెల్లడించాడు. ఆ తరువాత రెండు రోజులకు మరో కోటిన్నర రూపాయలు, మే 18న మరో 2.5 కోట్ల రూపాయలను తనకు పంపించినట్టు వెల్లడించాడు.

అదే రోజు రాత్రి 9గంటలకు తాను ఆదిత్య ఇంటికి వెళ్లి అతని వాటాగా కోటి రూపాయలు ఇచ్చానని చెప్పాడు. తన వద్ద ఉన్న డబ్బు నుంచి రూ. 36లక్షలను మల్కాజిగిరి నివాసి నక్క సాయిబాబాకు ఇచ్చానని, మరో రూ. 6.54 లక్షలను చెల్లించి భవానీ జువెలర్స్‌లో తాకట్టులో ఉన్న బంగారు నగలను విడిపించుకున్నట్టు చెప్పాడు. మరో 8.10 లక్షలు వెచ్చించి తన డ్రైవర్ రవి సోదరుడు నాగరాజు పేరిట మారుతి స్విఫ్ట్ కారును కొన్నట్టు వెల్లడించాడు. తన ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లును కొనటానికి రూ.20 లక్షలను రవీందర్‌డ్డి అనే వ్యక్తికి ఇచ్చినట్టు తెలిపాడు. మరో రూ. 12 లక్షలను వెంక అనే వ్యక్తికి అతని తండ్రికి వైద్య చికిత్స చేయించుకోవటానికి ఇచ్చినట్టు చెప్పాడు.

న్యాయవాదికి రూ. పది లక్షలు
న్యాయవాది శరత్‌కుమార్‌కు మరో పదిలక్షల రూపాయలను ఇచ్చినట్టు యాదగిరిరావు నేరాంగీకారంలో వెల్లడించాడు. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే చూసుకోవటంతోపాటు తప్పుడు ఆరోపణలతో పోలీసుఅధికారులు, దర్యాప్తు సంస్థలపై పిటిషన్లు వేయటానికే ఈ డబ్బు ఇచ్చినట్టు చెప్పాడు. ఆ సమయంలో గాలి జనార్దన్‌డ్డి బెయిల్ డీల్ గురించి న్యాయవాదికి చెప్పినట్టు పేర్కొన్నాడు. దాంతో ఏసీబీ అధికారులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉండాలని న్యాయవాది సూచించినట్టు యాదగిరిరావు తెలిపాడు. ముందస్తు బెయిల్ తీసుకుంటానని, దొరకనిపక్షంలో కోర్టులో సరెండర్ అయ్యేలా చూస్తానని శరత్‌కుమార్ హామీ ఇచ్చినట్టు వివరించాడు. పరారీలో ఉన్నపుడు తిరుపతి, చెన్నై, ముంబయి, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో తిరిగినట్టు వివరించాడు. బెయిల్ డీల్ చర్చలు జరుగుతున్నపుడు తాను 8179577761, 810661877, 9550032488, 9949698228, 9948405848 ఫోన్ నెంబర్ల ద్వారా చలపతిరావు, సోమశేఖరడ్డి, దశరథరాండ్డి, ఆదిత్య తదితరులతో మాట్లాడినట్టుగా తెలియచేశాడు.

రౌడీషీటర్ యాదగిరిపై ‘స్వలింగ’ వేధింపుల కేసు
నాచారం: నాచారం రౌడీషీటర్ యాదగిరిరావుపై మరో కేసు నమోదైంది. అతను తనను లైంగిక సంపర్కం కోసం వేధించేవాడని ఓ యువకుడు మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నాచారం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన నవీన్‌కుమార్ జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. 2002లో యాదగిరితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్వలింగ సంపర్కం ఏర్పడింది. కొద్దిరోజుల తర్వాత నవీన్‌కుమార్ యాదగిరిని కలవడం మానేశాడు. వెతికి పట్టుకున్న యాదగిరి.. వీడియా చిత్రీకరించానంటూ బెదిరించి.. లైంగిక వేధింపులకు గురిచేశాడని, ఈ తంతు 2008 వరకు కొనసాగిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నవీన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాదగిరిపై 377, 506 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు నాచారం పోలీసులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి