ఇది సర్ప ద్వీపం!
Updated : 7/3/2014 1:28:26 AM
Views : 621
-ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములకు నెలవు
-మనిషి మాంసం, కండరాలను అమాంతం కరిగించేయగల విషం
-మనిషి మాంసం, కండరాలను అమాంతం కరిగించేయగల విషం
సావోపౌలోబెజిల్),
జూలై 2: సాధారణంగా ఏ ద్వీపంలోనూ పాములుండవు. కానీ ఈ ద్వీపం మాత్రం
ప్రత్యేకం. ప్రపంచంలోనే అత్యంత విషసర్పాలకు నిలయంగా భాసిల్లుతోంది.
బ్రెజిల్ సావోపౌలో తీరప్రాంతం నుంచి 32కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి పేరు
ఇల్హా డే క్వీమదాగ్రాండే. కేవలం 4630 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ
ద్వీపంలో అడుగు అడుగుకో ప్రమాదకరమైన విషసర్పం ఉంది. ముఖ్యంగా గోల్డెన్
లాన్స్‌హెడ్ వైపర్‌గా పిలిచే పాము అత్యంత ప్రమాదకరమైంది. ఏ పాము అయినా
కాటేస్తే.. దాని విషప్రభావం చూపడానికి కొన్ని గంటల నుంచి రోజుల సమయం
పడుతుంది. కానీ ఈ పాము మనుషులను కాటేస్తే.. నిమిషాల వ్యవధిలో మాంసం,
కండరాలను మొత్తం యాసిడ్ మాదిరిగా కరిగించి వేస్తుంది. ఈ పాములు ఈ దీవిలో
తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. ఈ జాతికి చెందిన పాములు బ్రెజిల్‌లో కూడా
ఉన్నప్పటికీ భౌతికంగా వాటికీ, ద్వీపంలోని పాములకు చాలా తేడాలున్నాయి.
ముఖ్యంగా చాలా ఏళ్లు ఈ పాములు ఒంటరిగా మానవ, జంతు సంచారం లేని దీవుల్లో
ఉండడంతో వీటి విషం చాలా ప్రమాదకరంగా తయారైంది. ఈ పాముల ప్రధాన ఆహారం
పక్షులు.
ఇతర
ప్రాంతాలకు వలసవెళ్లే పక్షులు ఈ ద్వీపంలో విశ్రాంతి కోసం ఆగుతాయి. ఈ
పాములకు ఆ పక్షులే ప్రధాన ఆహారం. గాలిలో ఎగిరే పక్షులను తక్షణం చంపేందుకు
వీలుగా వీటి విషం అంత ప్రమాదకరంగా తయారైందని నిపుణులు పేర్కొంటున్నారు.
విహారయాత్రల కోసం దీవికివెళ్లే బ్రెజిల్‌వాసులు పాముకాటుకు గురై
చనిపోతుండడంతో ఈ దీవిని సందర్శించడం నిషేధమని బ్రెజిల్ ప్రకటించింది.
1909లో ఇక్కడ నిర్మించిన ఆటోమేటిక్ లైట్‌హౌజ్ మరమ్మతులకు అప్పుడప్పుడు నేవీ
సిబ్బంది మాత్రమే ఈ దీవికి వచ్చిపోతుంటారు. దీవి గురించి బయట ప్రపంచానికి
తెలిశాకే ఇక్కడి గోల్డెన్ లాన్స్‌హెడ్ వైపర్‌లు ప్రమాదంలో పడ్డాయి. కొందరు
వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా దీవికి వచ్చి వీటిని పట్టుకుని
బ్రెజిల్‌లో అమ్ముతున్నారు. ఒక్కో పాము ధర సుమారు 30వేల డాలర్ల ధర
పలుకుతుండడంతో వీటి వేట సర్వసాధారణమైపోయింది. గత కొన్నేళ్లలో పాముల సంఖ్య
15శాతానికి పడిపోయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి