1, జులై 2014, మంగళవారం

పెట్రోలు, డిజిల్ ఛార్జీలను పెంచాల్సిందేనా? ప్రత్యామ్నాయాలు లేవా?

పెట్రోలు, డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచుతున్నారు. కొంతమేరకు ఇప్పటికే పెరిగాయి. బడ్జెట్ లో మరిన్ని వడ్డింపులకు రంగం సిద్ధమయ్యింది. గత ప్రభుత్వం చేసిన వాదనలనే ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. ఇంధనం ఛార్జీల పెరుగుదల ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తుంది అంటున్నారు. కానీ డిజిల్ గ్యాస్ ధరలు పెరగటం వల్ల వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తుల వ్యయం, రవాణా ఖర్చులూ పెరుగుతాయి. అధిక ద్రవ్యోల్భణం ఆర్ధికాభివృద్ధిని దెబ్బతీస్తుంది.

ప్రభుత్వ రంగం చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టాల్లో వున్నవి కనుక ధరలు పెంచుతున్నామన్నది. మరో వాదన వాస్తవానికి ఈ కంపెనీలకు నష్టాలు లేవు. వున్నవి అల్లా అండర్ రికవరీలు, అండర్ రికవరీలంటే అంతర్జాతీయ ధరకు, దేశీయ ధరకు మధ్య తేడా ఉదాహరణకు డీజిల్ ధర అంతర్జాతీయ మార్కెట్ లో 5 డాలర్లు వుందనుకుందాం. (300రూపాయిలు) మన దేశంలో 50 రూపాయిలు వుందనుకుంటే మిగతా 250 రూపాయిలను అండర్ రికవరీ అంటారు.

వాస్తవానికి ఈ ధరను పెంచినా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ఆదాయం రాదు. ఇందుకు కారణం ధరను పెంచి పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ మార్కెట్ లో రిలయన్స్ బ్రిటీష్ పెట్రోలియం లాంటి దేశ విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు.ఫలితంగా ధర పెరిగే సరికి మార్కెట్ వీరి చేతుల్లోకి వెళుతుంది. వాస్తవానికి ఈ ప్రయివేటు కంపెనీలు రిటైల్ మార్కెట్ లోకి వచ్చి అధిక లాభాలు పొందేందుకే ధరను పెంచుతున్నారు. గతంలో లాభాలు లేవని ప్రయివేటు కంపెనీలు పెట్రోలు బంకులు పెట్టి మూసేశారు.

మనదేశం లో కన్నా పాకిస్థాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ లు చౌకగా వున్నాయి. ఇందుకు కారణం మనదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగ దారుల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటా సుమారు 3 లక్షల కోట్ల పన్నులు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వానికి సబ్సిడీల భారం పెరిగిందన్నది మరో వాదన. ఇది కూడా తప్పే ఉదాహరణకు ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేస్తే అయ్యే  ఖర్చు లీటరుకు  50 రూపాయిలు వుంటే దానిపై మరో 50 రూపాయిల పన్ను వేస్తారు. వందరూపాయిలు అవుతుంది. 75 రూపాయిలకు అమ్మి 25 రూపాయిలు సబ్సిడీ ఇచ్చామంటున్నారు. ఇంతకన్నా దొంగ లెక్కలు వుంటాయా?

ఇక మనదేశంలో ఉత్పత్తి అయ్యే దాన్ని కూడా అందర్జాతీయ మార్కెట్ లో ధరకు సమానంగా అమ్ముకోనిస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు తక్కువ వుండి ప్రయివేటు కంపెనీలు వేల కోట్ల లాభాలను ఆర్జిస్తున్నాయి.

ప్రయివేటు కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే ఈ ధరల విధానం వల్ల, ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్ప్తుల వినియోగ దారుల నుంచి పన్నుల ద్వారా భారీగా ఆదాయం సమీకరించడం వల్ల మనపై అధిక ధరల భారం పడుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి