అసలు విషయానికి వస్తే ఈజిప్టు సముద్ర జలాలలో గల సముద్ర గర్భ కేబుల్స్ కొన్ని రోజుల క్రిందట తెగి పోయాయట . దీని వలన భారత దేశం తో పాటు మిడిల్ ఈస్ట్ , దక్షిణాఫ్రికా వంటి దేశాల ఇంటర్నెట్ సేవల మీద బాగా ప్రభావం పడింది. ఈ తెగి పోయిన కేబుల్స్ లో South East Asia -Middle East -Western Europe 4 (SMW 4), India -Middle East -Western Europe (I -ME -WE ) మరియు Europe India gateway (EIG )కి సంబంధించిన కేబుల్స్ ఉన్నాయి. ఈ సమస్యను చక్కదిద్దడానికి ఆ ప్రాంతంలో జలాంతర్గత కేబుల్స్ ని పర్యవేక్షించే ఇంటర్నేషనల్ కన్సార్టియం అఫ్ ఆపరేషన్స్ ప్రయత్నం చేస్తుంది .
అయితే జరుగుతున్న పరిణామాలకు వేరే కారణాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు . ఈ పరిస్థితి కి గల కారణాన్ని రెండు సైబర్ దిగ్గజాల మధ్య జరుగుతున్న పోరు గా అభివర్ణిస్తున్నారు . ఏది ఏమయినా ఈ పరిస్థితి వలన భారత దేశం లోని అధిక భాగం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .
ఇక టెలికం సంస్థల విషయానికి వస్తే BSNL మరియు Airtel వంటి సంస్థల మీద ఈ ప్రభావం బాగా పడిందని ఎకనామిక్ టుడే పత్రిక పేర్కొంది . అయితే ఎయిర్టెల్ తన డేటా ట్రాఫిక్ ని మరో మార్గం గుండా తరలిద్దామని నిర్ణయించుకుంది. Vodafone , MTNL వంటి సంస్థల మీద కూడా ఈ ప్రభావం పడింది . ప్రస్తుతం సెలవులు కావడం వలన డేటా వాడకం అంతగా లేదని , సోమ వారానికి ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని , ఈ సమస్య పరిష్కారం కావడానికి మరొక 3 నుంచి 4 వారాల సమయం పట్ట వచ్చని Indian ISP Association President రాజేష్ చారియా గారు చెప్పారు .
మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే మీ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకోండి ... !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి