31, మార్చి 2013, ఆదివారం

మార్కెట్ విలువల మోత



globe
20-300% మేర విలువల పెంపు
అభివృద్ధి ప్రాంతాల్లో అధిక బాదుడు
- ప్రజలపై రూ.3వేల కోట్ల భారం
- ఇంటి స్థలాల కొనుగోలు ఇక గగనమే

హైదరాబాద్, మార్చి 30 (టీ మీడియా): మరోసారి సామాన్యుడి నడ్డి విరిగింది. పేదోడికి సొంతిల్లు కలగానే మిగిలనుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువల సవరణ పేరుతో శనివారం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు భూములు, ఇళ్ల స్థలాల కొనుగోలు మరింత భారంగా పరిణమించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువల పెంపు రూపంలో ప్రజలపై రూ.3వేలకోట్ల భారాన్ని మోపింది. అయితే గుడ్డిలో మెల్లగా గ్రామాలు, పట్టణాలన్నింటికీ ఒకటే విధానం అవలంబించాలని భావించిన సర్కార్ స్టాంపు డ్యూటీని 5నుంచి 4శాతానికి కుదించింది. ఇటీవలే అప్‌క్షిగేడ్ హోదా పొందిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను ప్రాంతాలనుబట్టి 20నుంచి 50 శాతం మేరకే పెంపును వర్తింపజేశామని అధికారులు అంటున్నప్పటికీ ఈ వాటా కొన్ని ప్రాంతాల్లో 300శాతంగా నమోదయింది. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాలతోపాటు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వ్యవసాయ భూములకు, ఇళ్లస్థలాలకు, అపార్ట్‌మెంట్లకు భారీ పెరుగుదల వర్తింపజేశారు. ఈ ప్రాంతాల్లో మార్కెట్ రివిజన్ కమిటీలు సూచించిన సవరణలను యథాతథంగా అమలు చేసిన సర్కార్ ప్రజల అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్, శివారు రంగాడ్డి జిల్లాలో స్వల్ప పెంపునే వర్తింపజేశారు. ఇప్పటికే ఇక్కడి మార్కెట్ విలువలు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ కేవలం15నుంచి 50 శాతం విలువలతో సరిపెట్టారు.

తిరుపతివంటి పట్ణాలకు తోడు తాజాగా మున్సిపాలిటీలుగా, మేజర్ పంచాయతీలుగా, కార్పొరేషన్‌లలో విలీనమయిన ప్రాంతాల్లో భూముల విలువలను గరిష్ఠంగా పెంచారు. వరంగల్, హన్మకొండలో రూ.80లక్షలుగా ఉన్న ఎకరం భూమి విలువను రూ. 1.45 కోట్లుగా నిర్థారించారు. నల్లగొండ జిల్లా అద్దంకి బైపాస్ రహదారిలో రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలకు భూమి మార్కెట్ విలువను పెంచారు. ఇక జాతీయ రహదారిపై ఉన్న కమర్షియల్ ప్లాట్ల విలువలను చౌటుప్పల్‌లో గరిష్ఠంగా చదరపు అడుగుకు రూ.10వేలకు పెంచడంతో భారీ ఆదాయానికి తెరలేపారు. జాతీయ రహదార్లు, బైపాస్ రోడ్లు, పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న లే అవుట్లకు సమీపంలోని భూముల విలువను విపరీతంగా పెంచిన సర్కార్ వాటిపై అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేయనుంది. దీంతో పేదలు, సామాన్యులకు గజం వ్యవసాయ స్థలంకానీ, ఇళ్లు కట్టుకునేందుకు చవక ధరకు ప్లాట్లు కానీ దొరకని పరిస్థితి ఎదురుకానుంది. తాజా మార్కెట్ విలువల పెంపుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్ రివిజన్ కమిటీలు సూచించిన మార్కెట్ విలువలు అశాస్త్రీయంగా ఉండటంతో ప్రజలపైభారీ బారం తప్పలేదన్న అభివూపాయాలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం ఇంటి స్థలం మార్కెట్ విలువను రూ.45 వేలుగా నిర్థారించారు.
bumi
ఇక అపార్టుమెంట్ల విలువను పరిశీలిస్తే ఇక్కడ చదరపు అడుగుకు రూ.3100 నిర్ణయించారు. విజయవాడలో చదరపుగజం ఇంటి స్థలానికి రూ.30వేలు ఉండగా, అపార్ట్‌మెంట్‌కు చ.అడుగుకు రూ.2300, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో స్థలం చ.గజానికిరూ.42వేలు, అపార్ట్‌మెంట్‌కు చ.అడుగుకు రూ.2900 నిర్ణయించారు. నారాయణగూడలో రూ.42వేలు, రూ. 2400, కూకట్‌పల్లిలో రూ. 32 వేలు, రూ. 2600లుగా, ఎల్బీనగర్‌లో స్థలం రూ. 18000, అపార్ట్‌మెంట్‌కు రూ. 2600లుగా నిర్ణయించారు. ఇంటి స్థలాలకు భారీగా పెంపును వర్తింపజేసినప్పటికీ మళ్లీ అదనంగా వీటితో సంబధం లేకుండా అపార్ట్‌మెంట్‌లకు స్థిరాస్తి వ్యాపారి తరహాలో మార్కెట్ వాల్యూను లెక్కగట్టడంతో ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు. ఏడాదికోమారు పెంచాల్సిన నగర ప్రాంత భూముల మార్కెట్ విలువలను, రెండేళ్లకోమారు పెంచాల్సిన గ్రామీణ ప్రాంతాల మార్కెట్ విలువలను గత రెండేళ్లుగా పెంచలేదని చెప్పిన ప్రభుత్వం ఈ ఉదంతంలో కోల్పోయిన మొత్తం ఆదాయంతోపాటు అదనంగా మరింత ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యం ఈ పెంపు ఫలితంగా నెరవేరే అవకాశం కనిపిస్తోంది. తాజా పెంపును గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసిన మార్కెట్ రివిజన్ కమిటీలు క్షేత్రస్థాయి సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడంతో అనుక పొరపాట్లు దొర్లాయి. అత్యధిక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నమోదయిన ప్రాంతాలు, ఓపెన్ ఆక్షన్లలో నమోదయిన ధరల వివరాల ఆధారంగా భూములు, ఇళ్ల స్థలాల విలువను నిర్థారించారు. వీటిలో వాస్తవికతను పక్కకు పెట్టడంతో అందుకు భిన్నమైన మార్కెట్ విలువల వర్తింపు జరిగిందనే ఆరోపణలు వెల్లు ఇక పట్టణ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధిల్లో సామాన్యుడి సొంతింటి కల నెరవేరే అవకాశం లేకుండా పోయింది. భారీగా పెరిగిన మార్కెట్ విలువల ఫలితంగా పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలకు భయపడి స్థలాల కొనుగోలుకు జనం విముఖత కనబరిచే అవకాశాలు లేకపోలేదు.

స్టాంపు డ్యూటీ ఒక శాతం కుదింపు
కొండంత పన్నులను వేసి గోరంత లాభం చేకూర్చినట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. భారీగా పెంచిన మార్కెట్ విలువలపై వ్యతిరేకత రాకుండా స్టాంపు డ్యూటీని 5 నుంచి 4 శాతానికి కుదిస్తూ.. వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలపై నగరాల్లో 5శాతం స్టాంపు డ్యూటీని, 2 శాతం బదిలీ సుంకం, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును వసూలుచేస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో 5 శాతం స్టాంపు డ్యూటీని, 3 శాతం బదిలీ సుంకాన్ని, 0.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుముతో కలిపి 8.5 శాతంగా రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు విధానం అమలులో ఉంది. తాజాగా పెంచిన మార్కెట్ విలువలతో పెరిగిన చార్జీలతో పోల్చితే ఇది అతిస్వల్పమే.

నిర్మాణ విలువలూ పెంచారు
- ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త రేట్లు

ఏ రంగంలోనూ ఆదాయాన్ని వదులుకోవడానికి సుముఖంగా లేని సర్కార్ అన్ని రకాల నిర్మాణాలపై భారీ పన్నులను మోపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1నుంచి భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువలతో పాటు కట్టడాలపై రిజిస్ట్రేషన్ భారాన్ని భారీగా పెంచుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలులోకి తేనుంది. ఫిబ్రవరి 2న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిర్మాణాలపై స్ట్రక్చరల్ రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న రేట్లు ఏప్రిల్ 1నుంచి అమలులోకి తెస్తామని అప్పట్లోనే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది పెరిగిన మార్కెట్ విలువలతోపాటు వీటినీ భరించాల్సి వస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి