18, మార్చి 2013, సోమవారం

ఆనం ఓట్ ఆన్ అకౌంట్: 2013-14బడ్జెట్ ముఖ్యాంశాలు


హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఉదయం శాసనసభలో 2013 -14 బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది మూడోసారి. 10.26 నిమిషాలకు ఆనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులను ఉటంకిస్తూ ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు చెప్పారు.
గ్రీన్ ఛానల్ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఈ బడ్జెట్ సువర్ణాధ్యాయంగా మిగిలుతుందని ఆన అన్నారు. మన కేటాయింపులు అన్ని రాష్ట్రాల కంటే మిన్న అన్నారు. బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి భారీగా కేటాయించారు. గతంలో కంటే దాదాపు రెట్టింపు కేటాయించారు.
బడ్జెట్ ముఖ్యాంఖాలు
- బడ్జెట్ అంచనా - రూ.1,61348 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - రూ.1,01,926 కోట్లు
ప్రణాళిక వ్యయం -  రూ.59,422కోట్లు
ద్రవ్య లోటు - రూ.24,487 కోట్లు
రెవెన్యూ మిగులు - రూ.1023 కోట్లు
- రూ.25, 962తో వ్యవసాయ బడ్జెట్
ప్రణాళికేతర వ్యయం - రూ.17,694 కోట్లు
ప్రణాళికా వ్యయం - రూ.8267 కోట్లు
ఈ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.72,450 కోట్లు
- ఈ ఏడాది కొత్త ఉద్యోగాలు 27,903
- తాగునీటి కోసం రూ.262 కోట్లు
- పారిశ్రామిక రంగానికి రూ.1120 కోట్లు
- విద్యుత్‌కు రూ.7117 కోట్లు
- సమాచార, సాంకేతిక రంగానికి రూ.207 కోట్లు
- అడవులు, పర్యావరణానికి రూ.551 కోట్లు
- శాంతిభద్రతలకు రూ.5386
- మౌలికా సదుపాయాలకు రూ.180 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.6670 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ.3666 కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ.8585 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.1027 కోట్లు
- వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6128 కోట్లు
- రహదారి, రవాణాకు రూ.7117 కోట్లు
- ఉన్నత విద్యకు రూ.482 కోట్లు
- సమగ్ర గ్రామీణాభివృద్ధికి రూ.11,200 కోట్లు
- సాంస్కృతిక రంగానికి రూ.69 కోట్లు
- వికలాంగులకు రూ.73 కోట్లు
- వెనుకబడిన తరగతులకు రూ.4027 కోట్లు
- తెలుగు బాట పేరిట సాంస్కృతిక కార్యక్రమాల కోసం రూ.25 కోట్లు
- మూడు లక్షళ మంది విద్యార్థులకు రాజీవ్ దీవెన పేరిట ఉపకారవేతనాలు
- గిరిజన సంక్షేమానికి రూ.2126 కోట్లు
- సాంఘిక సంక్షేమానికి రూ.4122 కోట్లు
- తిరుపతి, జహీరాబాద్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ స్కూళ్లు
- యువజన సేవకు రూ.280 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ.2712 కోట్లు
- అంగన్ వాడి భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.2700 కోట్లు
- ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.100 కోట్లు
- ఐటి శాఖకు రూ.207 కోట్లు
- పాఠశాల విద్యకు రూ.16990 కోట్లు
- గృహ నిర్మాణానికి రూ.2326 కోట్లు
- జలయజ్ఞానికి రూ.13,800 కోట్లు
- పోలీసు శిక్షఖణా సంస్థ ఆధునికీకరణకు రూ.100 కోట్లు
- 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు ఏర్పాటు
- 7వ తరగతి వరకు మెస్ ఛార్జీలు రూ.475 నుండి రూ.750కి పెంపు
- 8వ తరగతి నుండి పదో తరగతి వరకు మెస్ ఛార్జీలు రూ.535 నుండి రూ.850కి పెంపు
- హైదరాబాదులో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు
- ఉగాది నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 9 నిత్యావసర వస్తువుల పంపిణీ, ఇందుకు రూ.660 కోట్లు
- ఇంటర్, డిగ్రీ, పిజి వరకు మెస్ ఛార్జీలు రూ.520 నుండి రూ.1050కి పెంపు
- బిసి సంక్షేమానికి రూ.4027 కోట్లు
- వ్యవసాయానికి రూ.6,122 కోట్లు
- వేసవి పరిస్థితులు అధిగమించేందుకు రూ.262 కోట్లు
- పౌరసరఫరాలకు రూ.3231 కోట్లు
- స్టేడియం నిర్మాణం, క్రీడా సదుపాయాల కోసం రూ.200 కోట్లు
- బిసి కార్పోరేషన్, సొసైటీలకు రూ.436 కోట్లు
- విద్యార్థుల మెస్ ఛార్జీలకు రూ.250 కోట్లు
- రానున్న ఏడాదిలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్ లక్ష్యం
- హైదరాబాదులో తాగునీటి వసతి పెంపుకు రూ.6,770 కోట్లు
- 738497 రాష్ట్ర స్థూల ఉత్పత్తి,
- వైద్య వసతుల కల్పనకు రూ.6481 కోట్లు
- ఆరోగ్యశ్రీని కొనసాగిస్తాం
- ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్
- ప్రతికూల వాతావరణానికి రూ.332 కోట్లు
- చిత్తూరు జిల్లాలో ఇన్ క్యాప్ ద్వారా తాగునీటి సరఫరా ప్రాజెక్టు
- నెల్లూరులో మెడికల్ కళాశాలకు రూ.358 కోట్లు
- పట్టణ ప్రాంతాల్లోనూ స్త్రీనిధి పథకం అమలు
- కృష్ణా మూడోదశ పనులు పూర్తి చేసేందుకు రూ.1670 కోట్లు
- పర్యాటక రంగానికి రూ.163 కోట్లు
- రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ సొసైటీ
- 2013-14లో చిత్తూరు, తిరుపతిలలో తాగు నీటి పథకాలకు రూ.180 కోట్లు
- ప్రాణహిత-చేవెళ్ల, ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటింప చేసేందుకు చర్యలు
- వ్యవసాయానికి ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం లక్ష్యం
- జలయజ్ఞం కోసం మొత్తం వ్యయ అంచనా రూ.లక్షా 26వేల కోట్లు
- జలయజ్ఞం కోసం ఇప్పటి వరకు అయిన ఖర్చు రూ.67,208 కోట్లు
- జలయజ్ఞంలో 21,435 ఏకరాలకు సాగునీరు
- వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకృతి వైపరీత్యాలకు రూ.589 కోట్లు
- కనీస మద్దతు ధర లభించని పక్షంలో రైతులకు ఆలంబన నిధి రూ.100 కోట్లు
- వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం రూ.3,621 కోట్లు
- వర్షాధార వ్యవసాయ అభివృద్ధికి రూ.2,903 కోట్లు
- బిసి సంక్షేమానికి రూ.1013 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.538 కోట్లు
- గిరిజన సంక్షేమానికి రూ.574 కోట్లు
- సోలార్ పంపు సెట్లకు రూ.150 కోట్లు
- వడ్డీ లేని పంట రుణాలకు రూ.500 కోట్లు
- మెట్రో రైలుకు రూ.1980 కోట్లు
- ఈ ఏడాది నుండి రాజీవ్ దీవెన పథకం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి