31, మార్చి 2013, ఆదివారం

చార్జీల షాక్

 cmF
రూ.6,334.43 కోట్లు
ఇదీ జనానికి సర్కారీ కరెంటు వాత
ఈసారి ఎవర్నీ వదలని ప్రభుత్వం
యూనిట్‌కు 58 పైసల నుంచి రూ.1.15 పెంపు
6 నుంచి 10కి పెరిగిన డొమెస్టిక్ శ్లాబులు
గతంలో కన్నా 23% చార్జీల పెంపుదల
టెలిస్కోపిక్ పద్ధతి కొనసాగిస్తూనే దోపిడీ
ఉచిత కరెంటు సబ్సిడీ తగ్గింపు
ఏడు గంటలుమించి వాడితే
యూనిట్‌కు రూ.3.50 వడ్డన
చిన్నతరహా పరిక్షిశమలపై పిడుగు
భారీ పరిక్షిశమలకు భారీ వడ్డన
మోతమోగిన టీవోడీ చార్జీలు

హైదరాబాద్, మార్చి 30 (టీ మీడియా):రాష్ట్ర ప్రజలకు సర్కారు కరెంటు షాకిచ్చింది. రాజకీయ పార్టీల ఉద్యమాల నేపథ్యంలో కాస్తంత కనికరం చూపుతారేమోనన్న ఆశలను సైతం చిదిమిపారేసి.. ఆరువేల కోట్లపైగా భారాన్ని మోపింది. విభజించి పాలించాలన్న సిద్ధాంతంతో గృహ వినియోగదారుల శ్లాబులను విడగొట్టి మరీ పడగొట్టారు. ఎవర్నీ వదిలిపెట్టకుండా చతురతతో శ్లాబులను పెంచుతూ, అన్ని వర్గాల ప్రజలపై కరెంటు చార్జీల భారాన్ని మోపారు. పంచాయతీలు మొదలు ప్రార్థనా మందిరాల వరకు మోత మోగించారు. ప్రస్తుత టారిఫ్ రూ.28,996కోట్లకు అదనంగా 23 శాతంతో రూ.6,334.76 కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) శనివారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ (సోమవారం) నుంచి కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. సరాసరిగా ప్రతి యూనిట్‌పై 58 పైసల నుంచి రూ.1.15 వరకు భారం పడనుంది. గృహ, వాణిజ్య, చిన్నతరహా పరిక్షిశమలు, భారీ పరిక్షిశమలతోపాటు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వీధిదీపాల వెలుగుల్లో వేటినీ వదిలిపెట్టకుండా దాదాపుగా అన్ని కేటగిరీల్లో కరెంటు చార్జీలు పెరిగాయి. విద్యుత్ సంస్థలు రూ.12,727 కోట్ల మేరకు చార్జీల పెంపుదలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. విద్యుత్ సంస్థలు రూ.49వేల మేరకు ఏఆర్‌ఆర్‌లను ప్రతిపాదించి రూ.18,582 కోట్లను రెవెన్యూ లోటు అంచనా వేశాయి. అయితే ఈఆర్సీ ఏఆర్‌ఆర్‌లను రూ.40,639 కోట్లకు కుదించింది. అదే విధంగా వచ్చే ఏడాదికి 1.06లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్‌ను కూడా 89,845 మిలియన్ యూనిట్లకు కుదించి అంతర్గత నష్టాలను తగ్గించుకోవడం ద్వారా 77,410 మిలియన్ యూనిట్ల అమ్మకాలకు ఈఆర్సీ ఖరారు చేసింది. విద్యుత్‌చార్జీల పెంపుదల అంశంపై ఈఆర్సీని ప్రభుత్వం ప్రభావితం చేయడం విశేషం. ఇప్పటికే కరెంటు చార్జీలు ప్రజానీకాన్ని ఇబ్బందిపాలు చేస్తున్న నేపథ్యంలో కొత్తగా చార్జీల పెంపుదలపై ఈఆర్సీ పారదర్శకంగా వ్యవహరించాలని తొలుత భావించింది. అయితే ప్రభుత్వం ఈనెల 12, 23వ తేదీల్లో ఈఆర్సీకి లేఖలు రాయడమే కాకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వయంగా ఈఆర్సీకి వెళ్ళి అక్కడి పెద్దలతో మాట్లాడి చార్జీలను పెంచే దిశగా ఒత్తిళ్ళు తీసుకువచ్చినట్లు స్పష్టమవుతున్నది. అంతేకాకుండా ఈనెల 26న మరొకసారి ఉత్తరవూపత్యుత్తరాలు జరపడం గమనార్హం.

గృహవినియోగంపైనే 2వేల కోట్ల భారం
కొత్త టారిఫ్‌లో సుమారు రూ.2వేల కోట్ల అదనపు రెవెన్యూ కోసం గృహ వినియోగదారులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. చార్జీల పెంపుదలలో గృహ వినియోగదారులపై అదనంగా 15%, ఎల్‌టీ-ఇండస్ట్రీస్‌పై 19%, హెచ్‌టీ-ఇండస్ట్రీస్‌కు అదనంగా 23% చొప్పున పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీని రూ.401కోట్లను తగ్గించుకోవడం గమనార్హం. వాస్తవానికి ఉచిత కరెంటు కింద రూ.5,882కోట్లు ఇస్తామని చెప్పి వార్షిక బడ్జెట్‌లో 5,700కోట్లు ప్రతిపాదించింది. అయితే కరెంటు చార్జీల నిర్ణయం చేసే సమయానికి ఉచిత కరెంటు సబ్సిడీని రూ.5,480కోట్లకు తగ్గించుకుంది. ఇందులో 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకందారులకు ఇప్పటి వరకు రూ.2,075కోట్లు ఇవ్వగా, వచ్చే ఏడాదికి రూ.1,179కోట్లకు పరిమితం చేసింది. అదేవిధంగా వ్యవసాయరంగానికి ఇచ్చే సబ్సిడీని రూ.3,650కోట్ల నుంచి రూ.4,300కోట్లకు పెంచింది.

టెలిస్కోపిక్‌లోనే దోపిడీ
గృహ వినియోగదారులను విడగొట్టి పడగొట్టారు. గృహ వినియోగదారుల నుంచి సుమారు రూ.2వేల కోట్ల అదనపు రెవెన్యూను విద్యుత్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. మధ్యతరగతి ప్రజానీకం విద్యుత్ వాడకాన్ని లక్ష్యంగా పెట్టుకుని శ్లాబులను మార్చేశారు. కొత్త టారిఫ్‌లో గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నట్లు చెబుతూనే శ్లాబుల సంఖ్యను పెంచి ఒక్కొక్క శ్లాబులో భారీ వడ్డనలకు పాల్పడింది. ఇప్పటి వరకు ఉన్న ఆరు శ్లాబుల సంఖ్యను పది శ్లాబులకు పెంచారు. దీంతో ఒక్క యూనిట్ అదనంగా వినియోగించినా కనీసం రూ.32.50 నుంచి రూ.102.13 వరకు భారం పెరగడం ఖాయం. ఎక్కువ విద్యుత్ వినియోగం జరిపే వారికి తక్కువగా రేట్లు పెంచి తక్కువ విద్యుత్ వినియోగం కలిగిన వారిపై ఎక్కువ రెవెన్యూ వసూలుకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. 0-50 యూనిట్ల వినియోగదారుల్లో విభజన చేశారు. సబ్సిడీని గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేస్తూ యూనిట్ ధర రూ.1.45ను యథాతథంగా కొనసాగించారు. పట్టణవూపాంతంలో 0-50 యూనిట్ల విద్యుత్ వాడకం కలిగిన వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.2.60 చొప్పున వసూలు చేస్తారు. ఇప్పటి వరకు 51-100 శ్లాబుకు యూనిట్ రూ.2.60 ఉండగా ఇప్పుడు దీనిని రూ.3.25కి పెంచారు. గతంలో 101 నుంచి 200 వరకు ఒక శ్లాబు ఉండగా.. దానిని విడగొట్టి.. 101-150పేరుతో కొత్త శ్లాబు తెచ్చారు. 151-200 పేరుతో మరో శ్లాబు చేశారు. అదే విధంగా 201-300 శ్లాబును రెండుగా విడగొట్టారు. 301-500 వరకు ఉన్న శ్లాబును 301-400,401-500గా మార్చారు. 51-100 యూనిట్ల వాడకానికి ప్రస్తుతం రూ.75.10ల కట్టాల్సి ఉండగా, వంద యూనిట్ల లోపు వినియోగదారులు ఇకపై రూ.58 అదనపు భారంతో రూ.133.25లు చెల్లించాల్సి ఉంటుంది. 101-200 యూనిట్ల వాడకందారులు అదనంగా రూ.34.30 భారాన్ని భరించాల్సి ఉంటుంది. 201-300 యూనిట్ల వాడకం కలిగిన వారు అదనంగా రూ.102.13లు చెల్లించాల్సి వస్తుంది.

దోబీఘాట్లను, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లను ఎత్తేశారు
కొత్త టారిఫ్‌లో దోబీఘాట్లను, చిన్నతరహా పరిక్షిశమలు(ఎస్‌ఎస్‌ఐ యూనిట్స్)ను ఎత్తేశారు. ఇప్పటి వరకు ఎల్‌టీ-4 కేటగిరీలో కాటేజీ ఇండస్ట్రీస్, దోబీఘాట్‌లకు ప్రత్యేకంగా యూనిట్ రూ.2.67 ఉంది. కొత్త టారిఫ్‌లో దోభీఘాట్ అనే ప్రస్తావనే లేకుండా కాటేజీ ఇండస్ట్రీస్ (10హెచ్‌పీ)కి యూనిట్ రూ. 3.75గా నిర్థారించారు. చిన్నతరహా పరిక్షిశమలకు ప్రత్యేక ప్రస్తావన లేకపోవడంతో పరిక్షిశమల కేటగిరీలోనే వారికి బిల్లింగ్ ఉంటుందని తెలుస్తున్నది. ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అపహాస్యం చేసింది. 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ ఆపైన విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూ. 3.50 చొప్పున వసూలు చేయనున్నారు. సాగునీటి సహకార సంఘాలకు ఇప్పటివరకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా దానిని జనరల్ ఇరిగేషన్ కేటగిరీలో కలిపారు.

స్థానిక సంస్థలపై పెనుభారం
ఈ ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వీధిదీపాల వినియోగంపై చార్జీలను పెద్దమొత్తంలో పెంచారు. ఇప్పటి వరకు మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీలు, గ్రేడ్ల వారీగా మున్సిపాలిటీలకు వేర్వేరుగా విద్యుత్ రేట్లు ఉండగా, ఇప్పుడు అన్ని పంచాయితీలను ఒక కేటగిరీ కిందకు, అన్ని గ్రేడుల మున్సిపాలిటీలను ఒక కేటగిరీ కిందకు తీసుకువచ్చారు. దీంతో పంచాయతీలు, మున్సిపాలిటీల ఆదాయ వనరులతో నిమిత్తం లేకుండా అన్నింటికీ ఒకే విధమైన చార్జీలను నిర్ణయించడం ద్వారా ఎక్కువ ఆదాయమే లక్ష్యమని తెలుస్తున్నది.

ఏవియేషన్‌లోకి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
2012-13 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటుచేసిన విమానాక్షిశయాల కేటగిరీలోకి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను చేర్చారు. ఇప్పుడు విమానాక్షిశయాలు చెల్లిస్తున్న స్థాయిలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తమ కరెంటు బిల్లులను చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందులోనూ వీటికి టైమ్ ఆఫ్ డే టారిఫ్ వర్తింపజేస్తూ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్కువ టారిఫ్‌ను నిర్ణయించారు. ఇప్పటి వరకు యూనిట్‌కు రూ.5.97 ఉండగా.. రూ.6.58కు పెంచారు. టైమ్ ఆఫ్ డే టారిఫ్ కింద గరిష్ఠంగా (11కేవీ సామర్ధ్యం) యూనిట్‌కు రూ.7.58 చొప్పున వసూలు చేయనుండటంతో ఇక వీటి బతుకు బస్టాండ్ కానుంది.

్రపజలపై 6,500కోట్ల భారమా?
-టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్

హైదరాబాద్, మార్చి 30 (టీ మీడియా): పేద, మధ్య తరగతి ప్రజలపై మోపిన 6,500 కోట్ల విద్యుత్ భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో ప్రభుత్వం విద్యుత్ భారాన్ని పేదలపై మోపడాన్ని తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పేదలపై విద్యుత్ భారాన్ని మోపమని చెప్పి సీఎం.. మోసం చేశారని ఆరోపించారు. విద్యుత్ భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రతి 50 యూనిట్లకు ఒక స్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా లూటీకి ఆస్కారం కలుగుతోందని అన్నారు. విద్యుత్ భారం వల్ల హైదరాబాద్‌లో చిన్నతరహా, కుటీర పరిక్షిశమలు మూత పడుతున్నాయని.. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులుగా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్రానికి పరిక్షిశమలు రావడం లేదని దుర్మార్గపు ప్రచారం చేసిన పాలకులు.. ప్రస్తుతం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పేదలపై, చిన్న తరహా పరిక్షిశమలకు విద్యుత్ భారాన్ని వేస్తోందన్నారు. ఇది హిడెన్ దోపిడీ అని అభివర్ణించారు.

ప్రైవేట్‌కు ప్రయోజనాల కోసమే: రాఘవులు
విద్యుత్ చార్జీల పెంపును సీపీఎం తీవ్రంగా ఖండించింది. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులకు లాభాలు తెచ్చిపె రాష్ట్ర ప్రజలపై రూ.6500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రభుత్వం మోపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. ప్రైవేట్ ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చార్జీల పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. హేతుబద్ధంగా ఆలోచిస్తే ప్రస్తుతం కొత్తగా విద్యుత్ భారం మోపాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజల తరఫున పోరాడుతాం: నారాయణ

విద్యుత్ చార్జీల పెంపుదలలో ప్రభుత్వ ప్రమే యం ఉందని సీపీఐ మండిపడింది. సుమారు రూ. 6,500 కోట్లను విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం, ఈఆర్‌సీ ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యుత్ చార్జీల భారంపై ప్రజల తరఫున సీపీఐ ఆందోళన కార్యక్షికమాలను చేపట్టనుందని ఆయన తెలిపారు.

ఒకేసారి రెండు భారాలా?: టీ లోక్‌సత్తా
విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై కిరణ్ ప్రభుత్వం ఒకేసారి రెండు భారాలు మోపుతోందని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ మండిపడింది. ఓవైపు ప్రజలపై పెనుభారాన్ని వేసి, ఆర్థికంగా చితికిపోయేలా చేస్తూ.. మరోవైపు రాష్ట్ర మంత్రులు మాత్రం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో విహారయావూతలకు వెళ్లుతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు ధర్మాడ్డి దుయ్యబట్టారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి