6, జూన్ 2014, శుక్రవారం

మన సంఖ్యామానం!


భారతీయం
ఇవ్వాళ ఫేస్ బుక్ మిత్రుల నుంచి మన భారతీయ సంఖ్యామానాలపై ఒక ఇమేజ్ ఫైల్ అందింది. మనకు సాధారణంగా అంకెలు ఒకటి నుంచి కోటి వరకు బాగా అర్థమవుతాయి. పది కోట్లు, లక్షకోట్లు, కోటి కోట్లు.. ఇంతటితో మన లెక్కల జ్ఞానం అంతమవుతుంది. కాని వెయ్యి కోట్ల (అర్పుద్ధం) సంఖ్య తర్వాత మరో 25 అంకెల వరకు మన పూర్వీకులు ఉపయోగించారంటే నమ్మశక్యం కాదు. వెయ్యి కోట్ల నుంచి మహా భూరి వరకు ఆ అంకెలను లెక్కబెట్టడం కూడా మనకయితే అసాధ్యమే.. 
ఇది మన సమస్యేనా లేదా పాశ్చాత్య దేశాల్లో కూడా మిలియన్, బిలియన్, ట్రిలియన్ తర్వాత సగటు మనిషి లెక్కకు, అంచనాకు అందని భారీ అంకెలు ఏమైనా పూర్వం నుంచి ఉనికిలో ఉండేవా అనేది తెలియదు కాని మనపూర్వీకులు ఉపయోగించిన సంఖ్యలు ఎంత  పెద్దవో కింద చూడగలరు. వాటిని లెక్కపెట్టగలరేమో ప్రయత్నించగలరు.

ఒకటి =1
పది =10
నూరు =100
వెయ్యి =1000
పది వేలు =10000
లక్ష =100000
పది లక్షలు =1000000
కోటి =10000000
దశ కోటి =100000000
శత కోటి =1000000000
సహస్ర కోటి(అర్పుద్ధం) =10000000000
న్యార్ఫుద్ధం =100000000000
ఖర్వం =1000000000000
మహా ఖర్వం =10000000000000
పద్మం =100000000000000
మహాపద్మం =1000000000000000
క్షోణి =10000000000000000
మహా క్షోణి =100000000000000000
శంఖము =1000000000000000000
మహాశంఖం =10000000000000000000
క్షితి =100000000000000000000
మహాక్షితి =1000000000000000000000
క్షోభం =10000000000000000000000
మహా క్షోభం =100000000000000000000000
నిధి =1000000000000000000000000
మహానిధి =10000000000000000000000000
పరాతం =100000000000000000000000000
పరార్థం =1000000000000000000000000000
అనంతం =10000000000000000000000000000
సాగరం =100000000000000000000000000000
అవ్యయం =1000000000000000000000000000000
అమృతం =10000000000000000000000000000000
అచింత్యం =100000000000000000000000000000000
అమేయం =1000000000000000000000000000000000
భూరి =10000000000000000000000000000000000
మహా భూరి =100000000000000000000000000000000000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి