18, జూన్ 2014, బుధవారం

విద్యుత్ కోతలకు చెక్....


Jun 18, 2014 at 12:54 PM

 పెరిగిపోతున్న ఉక్కపోత, వేధిస్తున్న విద్యుత్ సమస్యలకు చెక్  పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు అక్కడే వినియోగించుకునే నూతన విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇరురాష్ట్రాలతో కొత్త విద్యుత్ ఒప్పందాలు చేసుకోవాలని జెన్ కోకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీకి 462మెగావాట్ల వరకు విద్యుత్ అందుబాటులోకి రానుంది. 
రాష్ట్ర విభజనతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ను నూతన రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 20 ప్రకారం తెలంగాణకు 53.89, ఆంధ్రప్రదేశ్ కు డిస్కమ్ లకు 46.11 శాతంగా నిర్ణయించింది. ఈ పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... విద్యుత్ సమకూర్చుకునే పనిలో పడింది. ఈ సమస్య పరిష్కారానికి గతంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవడమే మార్గమని భావించింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల విద్యుత్ తమకే వస్తుందని భావిస్తోంది. ఈ విషయమై ఏపీ జెన్ కోను  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర విభజన ముందు జెన్ కో విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం 8,924 మెగావాట్లు. ఇందులో థర్మల్ విద్యుత్ వాటా 5,092 మెగా వాట్లు. ఈ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టుల వాటా 2,810 మెగావాట్లు, తెలంగాణలోని ప్రాజెక్టుల వాటా 2,282 మెగావాట్లుగా ఉన్నాయి.  తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లోనే 518 మెగావాట్లు ఎక్కువ ఉన్నప్పటికీ వినియోగం ఆధారంగా ఇచ్చిన జీవో 20 కారణంగా ఏపీకు 2,384 మెగావాట్లు కేటాయింపు జరిగింది. పీపీఏల రద్దుతో ఆంధ్రప్రదేశ్ లోని జెన్ కో థర్మల్ ప్రాజెక్టుల విద్యుత్ మొత్తం ఆ రాష్ట్రానికే వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుత కేటాయింపునకు అదనంగా 462 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చే వీలుంది.
 మరోవైపు ఉభయ రాష్ట్రాల్లో 3,829 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ విద్యుత్ కూ, కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టులకూ జీవో 20 వర్తిస్తుంది. తెలంగాణ పరిధిలో జల విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ కంటే 200 మెగావాట్ల వరకు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వర్షాకాలంలో నీరున్నప్పుడే ఉత్పత్తికి వీలవుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మాత్రం నిరంతరం ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. విద్యుత్ కోనుగోలుపై ఏపీ జెన్ కో, విద్యుత్ పంపీణీ సంస్థల మధ్య కుదిరిన పీపీఏల ఒప్పందాల్లో కొన్నింటికి కాలపరిమితి 2002లోనే ముగిసింది. దీంతో ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు జెన్ కోతో ఉన్న
కొత్త ప్రాజెక్టులకు జెన్ కో సమర్పించిన పీపీఏలకు ఇంకా ఈఆర్ సీ ఆమోదముద్ర వేయలేదు. దీంతో వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రద్దు చేయాలని ఏపీజెన్ కో తన లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ఈఆర్ సీ ఆమోదం పొందిన వెంటనే... గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రద్దవుతాయి. మరోవైపు తెలంగాణ సర్కార్... ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే దృష్టిపెట్టింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి