9, నవంబర్ 2013, శనివారం

హైదరాబాద్ ఆదాయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు


-వచ్చే ఆదాయం 22.0 శాతమే
విభజించాక రెండు రాజధానుల్లోనూ పన్ను చెల్లింపులు
-సీమాంధ్ర ఆదాయానికి ఢోకా లేదు..
-ఆస్తులు, అప్పులు నిష్పత్తి ప్రకారమే పంపిణీ
-జీవోఎంకు నివేదిక పంపిన టీ జేఏసీ

bookహైదరాబాద్, అక్టోబర్ 21 (టీ మీడియా): గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీల నాయకులు, ఇతరులు చేస్తున్న వాదనలో ఏమాత్రం నిజం లేదని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచే 50 శాతానికి మించి ఆదాయం వస్తుందన్నది వితండవాదనేనని తేల్చి చెబుతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం కేవలం 22.0 శాతం మాత్రమే. ఆదాయం, అప్పుల పంపిణీలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రూపొందించిన నివేదికను టీ జేఏసీ తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందానికి పంపింది. ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎక్సైజ్ (ఆబ్కారీ) శాఖ పన్ను వసూళ్లు ప్రస్తుత రాజధాని అయిన హైదరాబాద్‌లోనే జమ అవుతున్నాయి. విభజన తర్వాత కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల్లోనూ ఇవి జమ అవుతాయి. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (మొదటి పేజీ తరువాయి)
లిమిటెడ్ (బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్ కంపెనీ(ఐఓసీ), ఆంధ్రవూపదేశ్ బేవరేజేస్ కంపెని లిమిటెడ్ (ఏపీబీసీఎల్) సహా పలు ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా వాటి విభాగాలను కొత్తగా ఏర్పడే ఆంధ్రవూపదేశ్ రాజధానిలోనూ రిజిస్టర్ చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలు సీమాంవూధలో క్రయ, విక్రయాలకు కూడా హైదరాబాద్‌లోనే పన్నులు చెల్లిస్తుండటంతో తెలంగాణ ఆదాయం అధికంగా కనిపిస్తోంది. సహజంగానే ఆయా సంస్థలు నిర్వహించే వ్యాపారాలు, లావాదేవీలకు సంబంధించిన పన్నులను ఆంధ్రవూపదేశ్ కొత్త రాజధానిలోనే చెల్లిస్తాయి. దీంతో హైదరాబాద్ ఆదాయం రెండు రాష్ట్రాలకు విభజన జరుగనుంది. వాస్తవాలను వక్రీకరించి నానా యాగీ చేసే వారికి ఇంతటి లాజిక్ కూడా అర్థం కాకపోవడం దుర్మార్గమే అవుతుందని తెలంగాణ ఉద్యమకారులు విమర్శిస్తున్నారు.

తెలంగాణ ఏర్పడే దాక కొత్త ప్రాజెక్టులను ఆపాల్సిందే
రాష్ట్ర విభజన నేపథ్యంలోకొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న సందర్భంలో ప్రస్తుతం కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు, పథకాలను చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందానికి టీ జేఏసీ నివేదించింది. 2013-14 బడ్జెట్‌లో కేటాయించిన పద్దులకు అనుగుణంగానే నిధులను ఖర్చు చేయాలని, అందులో పేర్కొనని పనులకు నిధులను ఖర్చు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కొత్త ఖర్చులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని విజ్ఞప్తి చేసింది.

ఆస్తులు.. అప్పులను న్యాయబద్ధంగా పంచాలి
bookరాష్ట్ర విభజన ప్రక్రియలో స్థిర, చరాస్తులు, ఆదాయం, అప్పులను న్యాయబద్ధంగా పంపిణీ చేయాలని జీవోఎంకు టీ జేఏపీ విజ్ఞప్తి చేసింది. 1956 నవంబర్ 1కి ముందున్న స్థిర, చరాస్తులను మినహాయించాలని కోరింది. ఆ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని, అప్పటి తెలంగాణ పరిధిలోని ఏ ఆస్తులను కూడా పరిగణలోకి తీసుకోవద్దని కోరింది. తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ స్టేట్ విలీనం తరువాతి స్థిర, చరాస్తులను మాత్రమే విభజన విషయంలో పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం 13 మార్చి 2013 వరకు ఉన్న మొత్తం రూ.లక్షా 54 వేల 79 కోట్ల అప్పుల్లో తెలంగాణకు రూ. 45,000 కోట్లు విభజించాలి. ట్రెజరీలలో ఉన్న నగదు నిల్వలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇతర బ్యాంకుల్లోని అప్పులను ఇరు రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారం విభజించాలి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా సేకరించిన సెక్యూరిటీలు, ఇన్వెస్ట్‌మెంట్ నిధులను, ఖర్చులను నిష్పత్తిగా పంపిణీ చేయాలి. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల కోసం తెచ్చిన అప్పులు, ఆయా ప్రాంతాల్లో వెచ్చించిన ఖర్చులను ఎక్కడికక్కడే విభజించాలి. ఉమ్మడి రాష్ట్రంలోని స్థిర,చరాస్తులు, భవనాలు, సంస్థలను, వర్క్‌షాప్‌లను, నిర్మాణాల్లో ఉన్న భవనాలను ఇరు ప్రాంతాలకు అనుగుణంగా విభజించాలి. రెవెన్యూ ఆదాయాన్ని కూడా నిష్పత్తి ప్రకారమే పంపకాలు చేయాలి. హైదరాబాద్ స్టేట్ హయాంలో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందున, దానికి పరిహారంగా ఆంధ్రవూపదేశ్ భవన్‌ను రాష్ట్రానికి కేటాయించినందున.. ఏపీ భవన్‌ను తెలంగాణకే కేటాయించాలని టీజేఏసీ కోరింది. కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రానికి కేంద్రమే ఢిల్లీలో భూమిని కేటాయించి కొత్త భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి