23, ఫిబ్రవరి 2012, గురువారం

మంత్రులా మజాకా నెలకు రెండు లకారాలు



అంగట్లో సొరకాయ ధర ఒక్కింటికి 18 రూపాయలు పల్కుతోంది. తగ్గిస్తాం...తగ్గిస్తాం అనే భీకర కోతలకు కొరుకుడు పడటం లేదు. ముంగిట్లోకి వచ్చే గ్యాస్‌బండ 400 రూపాయలకు అతి కష్టం మీద వంటింట్లోకి వచ్చి, వెలుగుతుంది. మీట నొక్కగానే వెలిగే బల్బు షాక్‌ కొట్టించే చార్జీలతో దెబ్బతీస్తుంది. నీటి కుళాయి తిప్పితే దూసుకువచ్చే నీరు నెలాఖరుకల్లా కళ్లు తిరిగేలా చేసే బిల్లులను కురిపించి, గుండె గుబేల్‌ మన్పిస్తుంది. ఇక మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో అమ్మా యిల పెళ్లిళ్లు చేయడం గగనకుసుమం తెచ్చినంతకష్టం. ఇక  ప్రభుత్వకార్యాలయాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు, ఎక్కడ సర్కారు అనే పేరిట ఉన్న కార్యాలయానికి వెళ్లినా లంచం ఏకాదశావతారంలా తానున్నంటూ తళుక్కుమంటూ సగటు జీవిని సాధిస్తుంది. అక్కడ ఎక్కడో అన్నాహజారే  అవినీతిపై దీక్ష వహిస్తూ, మధ్యలో అడ్డంకులతో విరమణ ప్రకటన చేస్తుంటాడు. అవినీతి భూతం వికటాట్టహాసం చేస్తూనే ఉంటుంది. సామాన్యుడు, మధ్యతరగతి సగటు జీవి దినదినగండం నూరేళ్ల ఆయుష్షు బతుకులీడుస్తాడు. 'సబ్‌ ఠీక్‌హై అంటూ సచివాలయంలో మంత్రులంతా బ్రేవో అంటూ బ్రేవుస్తారు. మంత్రాంగం జరుపుతారు. వారి భేటీల అనంతరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు గారంగా సాగనంపేసుకుంటారు. సీఎం పేషీ నుంచి తమతమ కార్ల వరకూ వచ్చేంత వరకూ లోపాయి కారీగా మాట్లాడుకుంటారు. భేటీలలో ఎక్కడా  ప్రజా సమస్యలపై సీరియస్‌ చర్చలు జరిపిన దాఖలాలు ఉండవు.  మంత్రులంతా ఓ  రకమైన భ్రాంతిలోనే ఉంటారు.
అసలు సమస్యలు ఏమిటి? ప్రజలు ఎందుకు ఆందోళనకు దిగుతారు? అనవసరపు ప్రకటనలతో, అర్థనగ్న ప్రదర్శనలతో ప్రజల యాగీ ఎందుకు? తాను చేసిందే  శాసనం, చెప్పిందే వేదంగా వారంతా ఎందుకు వంగివంగి దండాలు పెట్టరు? ఠంచన్‌గా ఐదేళ్లకోసారి తామిచ్చే పదోపరకకో ఆశపడి ఎందుకు డబ్బాల్లో ఓట్లే య్యరు? ఇవన్నీ వారికి ధర్మసందేహాలుగానే మిగులు తుంటాయి. తామెంత కష్టపడి ఎమ్మెల్యే అయిందీ, ఎంతగా అసెంబ్లీలో నానాయాగీ చేసి, పొడియం వద్దకు దూసుకువెళ్లి, మార్కులు కొట్టేసి మంత్రులయిందీ ఉత్తు త్తిగానేనా? ఎంతకష్టం. ఎంత ఓపిక. సీట్లు దక్కించు కున్నాక కోట్లు రాబట్టుకోవద్దా? మరోమారు ఎన్నికల కోసం కోట్లు విదుల్చుకోవద్దా? ఈలోగా రాజభోగాలు అనుభ వించొద్దా... ప్రజాస్వామ్యమనే పాలకపక్ష రాజరికంలో మంత్రులు రాజుల్లాంటి వారని కొందరి అభిప్రాయం. ప్రజల కష్టసుఖాలనేవి వారివారి సొంతాలు.. వారు జన్మత కొనితెచ్చుకున్నవి. ఎవరి అదష్టం వారిదే అనుకునే అమాత్యులవారు కొందరు ఉండనే ఉన్నారు. ఈ మధ్యనే మంత్రివర్గ భేటీ జరిగింది. వ్యాట్‌హాట్‌, కరెంట్‌ పోటు ఇతర అజెండాలతో భేటీ సాగింది. ఈ చర్చలు టీకాఫీల సాక్షిగా జోరుగా సాగాయి. ఎటు తేలకుండా ముగిశాయి. అయితే మంత్రివర్గం ఏకధాటిన ఒకేఒక్క అంశంపై మరుమాట లేకుండా ఏకాభిప్రాయానికి వచ్చేసింది. అది ఏకంగా మంత్రుల జీతభత్యాల పెంపుదలకు సంబం ధించిన అత్యంత స్వీయకీలకాంశం. ప్రస్తుతమున్న లక్ష రూపాయల  జీతభత్యాలను నెలకు 2 లక్షల 15 వేల రూపాయలకు పెంచేసుకుంటే పోలే అనే చర్చ జరగడం, దానికి అంతా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. పెంపుదల డిసెంబరు 2011 నుంచి అమలులోకి  వస్తుంది. ఫిబ్రవరిలో బకాయిలతో సహా మంత్రులకు జీతభత్యాల రూపేణా వచ్చేది భారీ సొమ్ము. మంత్రులు జీతభత్యాల కోసమే ఎదురుచూడరని అందరికీ తెలుసు. అయితే వారు జీతభత్యాల పెంపుదల కోసం ఎంతో పట్టుదలతో, భేదాలన్నీ మరిచి ఏకాభిప్రాయానికి  రావడం విశేషం.
జానియర్‌ డాక్టర్లు తమ భతిలో 5 వేల రూపాయలు పెంచాలని కోరుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స అందక రోగులు అల్లాడుతున్నారు. వ్యాట్‌ రద్దు చేయండంటూ వస్త్ర వ్యాపారులు దుకాణాలను మూసి వేశారు. ధర్నాచౌక్‌లో పలు డిమాండ్లతో రోజూ కొంగొత్త శిబిరాలు వెలుస్తున్నాయి. సుదూరంగా పంటపొలాలకు నీరందక రైతుల గుండెల్లో నిప్పులు రగులుతున్నాయి. ఇవన్నీ పరిష్కరించాలంటే పాపం ప్రభుత్వాలకు పంచవర్ష ప్రణాళికలే కాదు, యుగవర్ష ప్రణాళికలు కూడా సరిపోవు. అందుకే మంత్రులంతా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని, ప్రజా సమస్యలను పక్కకు పెట్టి అతి వేగంగా తమ జీతాల పెంపుదల నిర్ణయం తీసుకున్నారు. వారి దూకుడు ఖాతాలవారీగా చూస్తే రికార్డు స్థాయిలోనే ఉంది. ఉదాహరణకు క్యాంప్‌ ఆఫీసు అలవెన్స్‌ను 5 వేల నుంచి 15 వేలకు పెంచారు. ఇంధన చార్జీలను 7 వేల నుంచి 15 వేలకు హెచ్చించుకున్నారు. టూర్ల సందర్భంగా టీఏను రోజువారి 300 రూపాయల నుంచి 1500 రూపాయలకు పెంచారు. ఇక హైటెక్‌ సెల్‌ఫోన్ల కొనుగోళ్ల  కోసం ఇచ్చే 15 వేల పరిమితిని 30 వేల రూపాయలకు పెంచారు.  ఈ హెచ్చింపు నిర్ణయాల  అనంతరం మంత్రులు తాము కోటీశ్వరులం కామని, కేవలం ద్విలక్షాధికారులమని పబ్లిగ్గా  ప్రకటించుకోగలమనే ధీమాకు వచ్చారు.

LG's Optimus Vu Takes On Samsung's Galaxy Note:


When Samsung introduced the Galaxy Note at IFA, we were excited, but a bit perplexed. The Galaxy Note's 1280x800 HD Super AMOLED display could be a big winner, but the phone's size seemed too ungainly to make an effective phone. Later PR seemed to confound expectations further by referring to it as a 'phablet' rather than a phone or tablet. After strong European and Asian sales, though, the phone has been released on AT&T in the States, and interest is quite high. So it should be no surprise to see other entrants into this oversized phone space.
LG's Optimus Vu has been teased and leaked numerous times over the last few weeks, and so its announcement this weekend didn't come as a huge surprise. Unique to the Vu, versus the Note, is a 4:3 aspect ratio, which gives its 5" display a more squat appearance than the elongated 16:10 slates we're used to. The IPS display touts a 1024x768 resolution, so it's pixel density isn't quite as high as the Note's, though if it is an RGB screen its subpixel density should be impressively high and its color reproduction should be a bit more accurate than Samsung's SAMOLED display. 
Most recent Optimus devices have put Qualcomm's S3 processors to use, with the MSM8660 finding its place in the Optimus LTE recently, alongside the MDM9600 for LTE connectivity. Though Krait SoC's are just around the corner, we expect based on development times that the Vu will feature a similar MSM8660/MDM9600 combination. We have AT&T's Optimus LTE variant in house and so we know what kind of performance we can expect from the device. From a graphics standpoint, the Mali-400 GPU in the Note's Exynos SoC clearly outpaces the Adreno 220 in Qualcomm's S3. Compute performance should be comparable, but with the GPU being leveraged to a greater degree in Ice Cream Sandwich, the user experience delta might grow when both are updated later this year. 
When the 4:3 iPad was chased by 16:10 Honeycomb tablets, part of the discussion focused on the ergonomic differences of a slate that's so wide while in landscape mode. So while viewing widescreen content on a widescreen device might be a bit more satisfying, actually using the wider device can be a bit more of a hassle. LG is obviously hewing to the user data that says that larger devices benefit from the 4:3 form factor, and it'll be interesting to see whether the Note or the Vu feel better in the hand while being used as a tablet.
Physical Comparison
  LG Optimus Vu Samsung Galaxy Note Dell Streak Galaxy Nexus LTE Motorola Droid RAZR MAXX
Height 139.6 mm (5.49") 146.9 mm (5.78") 152.9 mm (6.02") 135.5 mm (5.33") 130.7 mm (5.15")
Width 90.4 mm (3.56") 83 mm (3.27") 79.1 mm (3.11") 67.9 mm (2.67") 68.9 mm (2.71")
Depth 8.5 mm (0.33") 9.7 mm (0.38") 9.98 mm (0.39") 9.47 mm (0.37") 8.99 mm (0.35")
Weight 139 g (4.9 oz) 178 g (6.3 oz) 220 g (7.76 oz) 150 g (5.3 oz) 145 g (5.1 oz)
CPU 1.5 GHz Dual-core Qualcomm Snapdragon 1.2 GHz Exynos 4210 Dual-core Cortex-A9 Qualcomm Scorpion @ 1GHz 1.2 GHz Dual-core OMAP 4460 Cortex-A9 1.2 GHz Dual-core OMAP 4430 Cortex-A9
GPU Adreno 220 ARM Mali-400 Adreno 200 PowerVR SGX 540 PowerVR SGX 540
RAM 1 GB LPDDR2 1 GB 512MB LPDDR1 1 GB LPDDR2 1 GB LPDDR2
NAND 32GB NAND 16 or 32GB NAND, up to 32GB microSD 16GB micro SD + 2GB integrated 16GB NAND 16GB NAND, 16GB Class 4 microSD preinstalled
Camera 8MP AF with LED Flash + 1.3MP Front Facing Camera 8MP AF with LED Flash + 2MP Front Facing Camera 5MP AF with dual LED Flash + Front Facing Camera 5MP AF with  LED Flash + 1.3MP Front Facing Camera 8MP AF with LED Flash + 1.3MP Front Facing Camera
Screen 5.0" 1024 x 768 IPS 5.3" 1280 x 800 HD Super AMOLED 5" 800 x 480 4.65" 1280 x 720 HD Super AMOLED 4.3" 960 x 540 Super AMOLED Advanced
Battery Integrated 7.7Whr Removable 9.25Whr Removable 5.661 Whr Removable 6.85Whr Internal 12.4Whr
But these are phones, and as such, we're concerned about the feasability of putting such a large device up to our heads. Anand spent some time with the Dell Streak as his only phone, and found the experiencing satisfying and the size a non-issue. What's notable is that the Streak, though longer than the Note and Vu, was also somewhat narrower. The Note and Vu are within a centimeter of each other in both height and width, but the Vu comes in nearly a half inch wider than the Streak. Portability could be a concern, too. With each device pushing six inches of length and over three inches in width, the ability to slip these devices into a pants pocket could be challenged. 
So, this begs the question? Are you interested in a phone this big? Is this meant to somewhat canibalize the small tablet market? Could this be your next phone? Let us know in the comments, we'll have more on the Vu next week, at MWC.
Source: LG

The Yamaha Moegi Demonstrates The Future of Fuel Efficiency



Yamaha Y125 Moegi Concept Courtesy Yamaha
Since the days of $4 gas began, the single-cylinder motorcycles and scooters that dominate international megacities have become increasingly common on American streets. Engineers at Yamaha created the Y125 Moegi concept to capitalize on that trend. They based it on the company’s first motorcycle, the 1955 125-cc YA-1, but they also included some modern touches, in particular an ultralight frame and a new cylinder design that could help make the Moegi one of the lightest and most fuel-efficient motorcycles ever.
The Y125 Moegi, which is 90 percent aluminum, weighs just 176 pounds (50 pounds less than an entry-level Vespa). Engineers molded the aluminum frame using Yamaha’s proprietary “controlled-filling” die-casting process. Controlled filling reduces air bubbles in the finished parts by 20 percent, making it possible to build strong, thin components that are 30 percent lighter.
Like the original YA-1, the Moegi runs on an air-cooled, 125-cc engine, which connects to the bike’s 20-inch rear wheel with a simple belt drive. But engineers replaced the YA-1’s lawnmower-like two-stroke with a low-friction four-stroke. They also incorporated another Yamaha invention: the DiASil cylinder, the world’s first mass-produced all-aluminum, die-cast motorcycle cylinder. The DiASil’s abrasion-resistant aluminum alloy dissipates heat at three times the rate of steel. When the engine isn’t being adequately cooled by the wind (for example, when riding uphill or stuck in traffic), there’s less power loss resulting from increased engine heat.
Yamaha hasn’t announced a horse-power rating for the Moegi engine, but 10 to 15 horsepower would be enough to propel a bike this light to 50 mph. Yamaha engineers have said, however, that the Moegi could achieve 188 mpg, which would make it nearly four times as efficient as a typical motorcycle.
Mileage: Up to 188 mpg
Weight: 176 pounds

13, ఫిబ్రవరి 2012, సోమవారం

విదేశాల్లో భారతీయులు దాచిన బ్లాక్‌మనీ


 
 విదేశాల్లో భారతీయులు దాచిన బ్లాక్‌మనీ
 సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వెల్లడి
ట్యాక్స్ హెవెన్స్‌లో ఈ మొత్తాన్ని దాచారు
స్విస్ బ్యాంకులో భారీ మొత్తాలు డిపాజిట్ చేసినవాళ్లలోనూ ఎక్కువ మంది మనోళ్లే..
ఓ అత్యున్నత స్థాయి అధికారి నల్లధనంపై అంచనాను వెల్లడించడం ఇదే తొలిసారి

న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో మనోళ్లు అక్రమంగా దాచిపెట్టిన నల్లధనమెంతో తెలుసా? రూ.24.5 లక్షల కోట్లు! ఈ విషయాన్ని సీబీఐ డెరైక్టర్ ఎ.పి.సింగ్ స్వయంగా వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో భారీ మొత్తాల్లో డిపాజిట్లు చేసినవారిలో కూడా భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. అవినీతి నిరోధం, ఆస్తుల రికవరీపై జరిగిన తొలి ఇంటర్‌పోల్ గ్లోబల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. పన్నుల స్వర్గధామాలుగా(ట్యాక్స్ హెవెన్స్-ఈ దేశాల్లో పన్నులు చాలా తక్కువగా ఉంటాయి.. లేదా అస్సలు ఉండవు) పేరొందిన మారిషస్, స్విట్జర్లాండ్, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాం డ్స్ వంటి దేశాలకు భారతీయులు భారీ స్థాయిలో అక్రమ ధనాన్ని తరలించినట్లు సింగ్ వెల్లడించారు. దేశంలో అవినీతి పాలనాపరంగా పెద్ద సమస్యగా ఉందని, దీని నిర్మూలనకు ఏకపరిష్కారం లేదని, పలు స్థాయుల్లో అవినీతిని పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. ఇది లా ఉండగా.. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం విషయంలో పలు అంచనాలు ఉన్నాయి. ఈ మొత్తం రూ.25 లక్షల కోట్ల 75 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని చెబుతారు. దీనికి సంబంధించిన అధికారిక అంచనా అంటూ ఏమీ లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రస్తుతం చెబుతున్న అంకెలన్నీ నిర్ధారించని అంచనాలేనని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌కు సంబంధించి అత్యున్నత స్థాయిలో ఉన్న ఓ అధికా రి.. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం విషయంలో ఓ అంచనాను వెల్లడించడం ఇదే తొలిసారి. అయితే, ఏ ఆధారాల మేరకు ఆయనీ అంచనాను వెలువరించారన్న విషయాన్ని సింగ్ తెలుపలేదు.

ప్రపంచ బ్యాంకు అంచనా 74 లక్షల కోట్లు..

‘నల్లధనానికి సంబంధించిన సమాచారాన్ని మనతో పంచుకునే విషయంలో పన్నుల స్వర్గధామాలుగా పేరొందిన ఈ దేశాల్లోని నేతల్లో దృఢమైన రాజకీయ సంకల్పం లోపించింది. ఎందుకంటే పేద దేశాల నుంచి అక్రమంగా వచ్చిన ఈ సొమ్ముతోనే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకున్నాయన్న విషయం వారికి తెలుసు’ అని సింగ్ వ్యాఖ్యానించారు. వీటిల్లోని 53 శాతం దేశాలు అతి తక్కువ అవినీతి ఉన్న దేశాలని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్’ పేర్కొందని చెప్పారు. ‘ఈ ట్యాక్స్ హెవెన్స్‌లో న్యూజిలాండ్ కూడా ఉంది. ఈ దేశం అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా మొదటి ర్యాంకు పొందింది.

సింగపూర్‌కు 5, స్విట్జర్లాండ్‌కు 7వ ర్యాంకు లభించాయి’ అని వివరించారు. నల్లధనాన్ని గుర్తించడం, ఆ ఖాతాలను స్తంభింపజేయడం, అనంతరం అక్రమ అస్తులను జప్తు చేయడం సంక్లిష్టమైన ప్రక్రియ అని.. దీనికి ప్రత్యేక నైపుణ్యంతోపాటు దృఢమైన రాజకీయ సంకల్పం అవసరమని తెలిపారు. అక్రమ ఆస్తులు, ఖాతాల గుర్తింపునకు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాలు అవసరమన్నారు. ‘అంతర్జాతీయంగా చూస్తే.. క్రిమినల్ చర్యలు, పన్ను ఎగవేతల ద్వారా విదేశాల్లో దాచిన నల్లధనం రూ.74 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

ఇందులో దాదాపు రూ.2 లక్షల కోట్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో చెల్లించినవే ’ అని తెలిపారు. అయితే, గత 15 ఏళ్ల కాలంలో రూ.74 లక్షల కోట్లలో రూ.24 వేల కోట్లను మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకోగలిగారని సీబీఐ డైరెక్టర్ సింగ్ వివరించారు. దర్యాప్తు సంస్థలకున్న ప్రాదేశిక, అధికార పరిధుల పరిమితులను నేరగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. వీరు తమ నేరాలను కనీసం రెండు దేశాలకు విస్తరించి, మూడో దేశంలో ధనాన్ని దాచిపెడుతున్నారని సింగ్ పేర్కొన్నారు. ఇటీవల సీబీఐ దర్యాప్తు చేసిన 2జీ స్పెక్ట్రమ్, కామన్వెల్త్ క్రీడలు, మధుకోడాలాంటి ముఖ్యమైన కేసుల్లో డబ్బును దుబాయ్/సింగపూర్/మారిషస్‌ల మీదుగా స్విట్జర్లాండ్ తదితర ట్యాక్స్ హెవెన్ దేశాలకు తరలించినట్లు కనుగొన్నామని ఆయన చెప్పారు.

ధనిక దేశాల ప్రయోగశాల గ్రీస్‌


  • ప్రపంచ వీక్షణం
తమ దేశాన్ని జర్మనీకి బానిసగా మార్చివేస్తున్నారని దీనికి తలవంచటం కంటే చావటం గౌరవంగా ఉంటుందని అనేక మంది గ్రీసు పౌరులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో జర్మనీ వ్యతిరేకత బాగా పెరిగింది. గ్రీస్‌లో పని చేస్తున్న బ్యాంకులన్నీ జర్మనీ లేదా ఆస్ట్రియా దేశాలకు చెందిన ప్రయివేటు సంస్థలే. అవి ఇప్పటివరకూ గ్రీస్‌ ప్రభుత్వం అడిగిన మేరకు అప్పులు ఇచ్చాయి. ఐరోపాలో ఎక్కడా లేనంత ఎక్కువ వడ్డీలను వసూలు చేశాయి. ఇప్పుడు గ్రీస్‌ ప్రభుత్వం దివాళా స్థితికి చేరింది. అందుకే జర్మనీ రంగంలోకి దిగింది. ఇచ్చిన అసలు కంటే వడ్డీ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అందువలన మొత్తం అప్పు 20 వేల కోట్ల యూరోలకు చేరింది.
ఒకవైపు జనాగ్రహాగ్నికి కొన్ని భవనాలు దగ్దం కాగా, మరోవైపు దాదాపు లక్షమంది పార్లమెంట్‌ భవనపు ముట్టడి, వారిపై వేలాది మంది పోలీసుల దమనకాండ... ఈ గందరగోళాల మధ్య ఆదివారం అర్ధరాత్రి గ్రీస్‌ పార్లమెంట్‌ మరో విడత పొదుపు చర్యలకు ఆమోదం తెలిపింది. కమ్యూనిస్టులు, కొంత మంది ఇతర పార్టీల ఎంపీలు తప్ప ప్రధాన రెండు సంకీర్ణ కూటమి పార్టీలు 'ఐక్యంగా' దేశ భక్తి పేరుతో ప్రజావ్యతిరేక చర్యలకు ఆమోద ముద్ర వేశాయి. ఈ ఓటింగ్‌ వాటిలో చిచ్చు రేపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఐరోపా యూనియన్‌, ఐరోపా సెంట్రల్‌ బ్యాంకు ఉమ్మడిగా రూపొందించిన ఈ పొదుపు చర్యల పథకాన్ని 199-74 ఓట్ల తేడాతో పార్లమెంట్‌ ఆమోదించింది. సోషలిస్టు, మితవాద న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన 37 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. విప్‌ను ధిక్కరించి నందుకు సోషలిస్టుపార్టీ 153 మంది తన ఎంపీల్లో 20 మందిని, న్యూడెమోక్రసీ పార్టీ 83 మందిలో 21 మందిని బహిష్కరించింది. ఈ రెండు పార్టీలకు చెందిన ఆరుగురు మంత్రులు తాము ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మూడవ చిన్న పక్షమైన మితవాద ఫాసిస్టు శక్తి 'పాపులర్‌ ఆర్థొడాక్స్‌ ర్యాలీ' పార్టీ తన ఎత్తుగడల్లో భాగంగా పొదుపు ప్యాకేజీని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సంకీర్ణ కూటమి నుంచి వైదొలిగింది. సంక్షోభం నుంచి గ్రీస్‌ను రక్షించే పేరుతో సోషలిస్టు పార్టీ ప్రభుత్వాన్ని రాజీనామా చేయించిన ఐరోపా యూనియన్‌ దాని స్థానంలో ఐరోపా సెంట్రల్‌ బ్యాంకు మాజీ అధికారి పాపా డెమోస్‌ను ప్రధానిగా చేసి ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేవరకు కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రజలపై కఠిన చర్యలకు పాల్పడితే తమకు పుట్టగతులుండవని పార్టీలు భయపడుతున్నందున ఐరోపా యూనియన్‌ పార్టీల ప్రమేయం లేని ప్రభుత్వాన్ని ప్రతిష్టించింది. ఈ ఉదంతం ఐరోపాలో మరిన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు, నిరంకుశ పోకడలవైపు మళ్లిస్తున్నది. అదలా ఉంచితే గ్రీస్‌ తాజా సంక్షోభం నుంచి గట్టెక్కుతుందా? అన్నది ట్రిలియన్‌ డాలర్ల ప్రశ్న.
గ్రీస్‌ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు రూపొందించిన 13 వేల కోట్ల యూరోల ప్యాకేజిని మార్చి 20లోగా ఆమోదించకపోతే దేశం మరిన్ని తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని ఆపద్ధర్మ ప్రధాని ల్యూకాస్‌ పాపాడెమోస్‌ ఓటింగ్‌కు ముందు టీవీలో ప్రసంగిస్తూ పౌరులను భయపెట్టారు. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు నిలిచిపోతాయన్నాడు. స్కూళ్లు, ఆసుపత్రులు పని చేయవు, బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోలేము ఇలా సకల ఆర్థిక అనర్ధాలు సంభవిస్తాయని చెప్పారు. ఇంతకీ ఆ పొదుపు చర్యలేమిటి? కనీస వేతనంలో 22 శాతం తగ్గింపు, గత మూడేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇప్పటికే 45శాతం తగ్గించారు. దీని ప్రభావం వల్ల ప్రయివేటు రంగంలో కనీస వేతనాలు కూడా తగ్గిపోతాయి. ఉమ్మడి బేరసారాల హక్కును పరిమితం చేశారు. ఈ ఏడాది 15వేల మందిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించాలని నిశ్చయించారు. బడా పెట్టుబడిదారులకు పన్ను రాయితీలను కొనసాగించేందుకు స్వయం ఉపాధి పొందుతున్నవారి నుంచి పన్నును విధిగా వసూలు చేయాలని నిర్ణయించారు. బేసిక్‌ పెన్షన్ల కోత, 2015 నాటికి లక్షా 50వేల ప్రభుత్వ ఉద్యోగాల రద్దు, ఇప్పుడున్న నిరుద్యోగశాతం 20.9 నుంచి ఎప్పుడు పదిశాతానికి చేరుతుందో అప్పటి వరకు పని చేస్తున్న ఉద్యోగులకు వేతన స్థంభన. ఇలా ఖాళీ పేపర్‌పై సంతకం చేసి ఇచ్చినట్లుగా ఏప్రిల్‌లో జరుగుతాయనుకుంటున్న ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం అమలు జరిపే విధంగా అనేక ప్రజా వ్యతిరేక చర్యలను ముందుగానే చట్టబద్దం గావించారు. అంటే ప్రజాభిప్రాయం, పార్టీల మేనిఫెస్టోలతో నిమిత్తం లేకుండా నిరంకుశంగా గ్రీస్‌ సార్వభౌమత్వాన్ని హరించే విధంగా ఐరోపా యూనియన్‌ వ్యవహరించింది.
పోనీ ఈ చర్య గ్రీస్‌ సమస్యను పరిష్కరిస్తుందా? యూరో కూటమి రూపొందించిన ఈ ప్యాకేజీ కింద అందచేసే 13 వేల కోట్ల యూరోల నుంచి ఒక్క యూరోను కూడా ప్రధాని పాపా డెమోస్‌ చెప్పినట్లుగా వేతనాలచెల్లింపులు, ఆసుపత్రులు, స్కూళ్లకు వెచ్చించడం లేదు. ఎందుకంటే గతంలో తామిచ్చింది ఒకందుకైతే, గ్రీస్‌ ప్రభుత్వం మరొకదానికి ఉపయోగించుకుందని, అందువలన దాని మాటలను ఇంకే మాత్రం నమ్మలేమని తాజా ప్యాకేజి చర్చల సందర్భంగా ఐరోపా దేశాలు నిర్మొహమాటంగా చెప్పాయి. తామివ్వ బోయే సొమ్ముకు ఒక ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసి తమ తనిఖీకి అందుబాటులో ఉంచాలని అప్పుడే కిస్తీలను నిర్ణీత గడువు ప్రకారం విడుదల చేస్తామని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది. ప్రత్యేక ఖాతాలో జమ చేసిన సొమ్ములో ముందుగా గ్రీస్‌ రుణాలను తీర్చేందుకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా మిగిలితే దానిని మాత్రమే ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ మొత్తంతో గ్రీస్‌ అప్పు తీరి పోతుందా అంటే లేదు. ఇప్పుడు దాని స్థూలాదాయానికి మించి 163 శాతం అప్పులలో మునిగి ఉంది. దానిని 2020 నాటికి 120శాతానికి తగ్గించేందుకు మాత్రమే దీనిని ఉద్ధేశించారు. అంటే గ్రీస్‌ ఆ తరువాత కూడా అప్పుల కుప్పగానే ఉంటుంది. తమ దేశాన్ని జర్మనీకి బానిసగా మార్చివేస్తున్నారని దీనికి తలవంచటం కంటే చావటం గౌరవంగా ఉంటుందని అనేక మంది గ్రీసు పౌరులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో జర్మనీ వ్యతిరేకత బాగా పెరిగింది. గ్రీస్‌లో పని చేస్తున్న బ్యాంకులన్నీ జర్మనీ లేదా ఆస్ట్రియా దేశాలకు చెందిన ప్రయివేటు సంస్థలే. అవి ఇప్పటివరకూ గ్రీస్‌ ప్రభుత్వం అడిగిన మేరకు అప్పులు ఇచ్చాయి. ఐరోపాలో ఎక్కడా లేనంత ఎక్కువ వడ్డీలను వసూలు చేశాయి. ఇప్పుడు గ్రీస్‌ ప్రభుత్వం దివాళా స్థితికి చేరింది. అందుకే జర్మనీ రంగంలోకి దిగింది. ఇచ్చిన అసలు కంటే వడ్డీ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అందువలన మొత్తం అప్పు 20 వేల కోట్ల యూరోలకు చేరింది. ఈ మొత్తంలో తాము సగాన్ని వదులు కుంటామని మిగిలిన సగాన్ని తమకు ఇప్పిస్తే చాలని ఆ బ్యాంకులు కూడా అంగీకరించాయి. అయితే అందుకు అనేక షరతులు కూడా విధించాయి. పొదుపు చర్యలు, అప్పులు తీరిస్తే గ్రీస్‌ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా అంటే గ్యారంటీ ఇచ్చేవారెవరూ లేరు. దేశంలో మొత్తం నిరుద్యోగం 21శాతానికి చేరగా, యువకుల్లో ఇది 50శాతం దాకా ఉంది. అధికారికంగా మూడోవంతు కుటుంబాలు దారిద్య్రంలోకి జారాయి. ఉన్న ఉపాధితో పాటు కొంపా గోడూ కోల్పోతున్నవారు నానాటికీ పెరుగుతున్నారు. తాము రోజుకు రెండున్నరలక్షల మందికి అన్నదానం చేస్తున్నట్లు సాంప్రదాయక చర్చి ప్రకటించింది. తీసుకున్న కొత్త అప్పులను పాత రుణాల చెల్లింపునకే జమ చేస్తే గ్రీస్‌ రోజువారీ అవసరాలకు తిరిగి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగాక అప్పులను పరిశ్రమలు,ఇతర రంగాలలో పెట్టుబడులుగా పెడితే ఆర్థిక వ్యవస్థ కోలుకొని అనేక సమస్యలు పరిష్కారమౌతాయి. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ద్రవ్య పెట్టుబడిదారులు కనుక వారు అందుకు అంగీకరించరు. ఒక విషవలయంలో గ్రీస్‌ చిక్కుకొని అంతిమంగా ప్రజల జీవనం దుర్భరంగా మారనుంది. ఇప్పుడున్న సంక్షోభం నుంచి 2015వరకు గ్రీస్‌ బయట పడలేదన్నది ఆర్థికవేత్తల అంచనా. ఈ పొదుపు చర్యలకు వ్యతిరేకంగా 62 నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కొన్ని చోట్ల జర్మన్‌ పతాకాలను తగుల బెట్టారు. ఏడవ తేదీన సమ్మె చేసిన కార్మికులు తిరిగి పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా 10,11 తేదీలలో 48 గంటల సమ్మె చేశారు. సమ్మెకు ముందు రోజు కమ్యూనిస్టుపార్టీ పెద్ద ప్రదర్శన జరిపింది.కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి అలేకా పాపరిగా ఆదివారం నాడు ఒక ప్రకటన చేస్తూ కార్మికులు చివరకు తమ రక్త మాంసాలను త్యాగం చేసినప్పటికీ ఈ దివాళా ఆగేలా కనపడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఐరోపా యూనియన్‌ నుంచి గ్రీస్‌ వైదొలగటం, అప్పులను ఏకపక్షంగా రద్దు చేయటం తప్ప మరొక మార్గం లేదు. ఇదిగాకుండా మరొకటి జరిగితే కార్మికుల పాలిట అది విషాదంగా మారుతుందని హెచ్చరించారు.
'కథిమెరినీ' అనేక పత్రిక ఈనెల మొదటి వారంలో జరిపిన ఒక సర్వేలో వామపక్షాలకు పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమవుతున్నట్లు తేలింది. ఈ సర్వే ప్రకారం కమ్యూనిస్టుపార్టీని 12శాతం, డెమోక్రటిక్‌ లెఫ్ట్‌ను 12.5, రాడికల్‌ లెఫ్ట్‌ కూటమిని 12శాతం మంది సమర్థిస్తున్నారు. గ్రీన్స్‌ పార్టీ కూడా తగినన్ని ఓట్లు తెచ్చుకొని పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం పొందవచ్చని భావిస్తున్నారు. ఇంతకూ అంతటి పెద్ద ఐరోపా యూనియన్‌ ఇంత చిన్న దేశం గ్రీస్‌ గురించి ఇంతగా ఎందుకు పట్టించుకుంటున్నది? వరుసగా ఐదవ సంవత్సరం ఆర్థిక మాంద్యంలో ప్రవేశించిన గ్రీసు ఐరోపా ధనిక దేశాల ప్రయోగశాలగా మారింది. పొదుపు మరొక పేరుతో ఇక్కడ ప్రజలపై భారాలు మోపటంలో జయప్రదమైతే ఇతర సంక్షుభిత దేశాలలో కూడా వాటిని అమలు జరపటం సులభం అవుతుందన్నది ఐరోపా పాలకవర్గాల అంచనా. అందుకే అనేక విమర్శలు, వత్తిళ్లు వస్తున్నా ప్రధాన దేశాలన్నీ పట్టువిడకుండా గ్రీసు మెడలు వంచేందుకు ప్రయత్నించాయి. కేవలం కోటీ పదిలక్షల మంది మాత్రమే జనాభా ఉన్న చిన్న దేశం గ్రీస్‌ కనుక ఇక్కడ తలెత్తే ప్రజావ్యతిరేకతను సులభంగా అణచివేయవచ్చనేది ధనిక దేశాల ఆలోచన
ఎం కోటేశ్వరరావు

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

మార్కెట్లోకి ముడుచుకుపోయే కారు


ప్రపంచ కారు చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ముడుచుకుపోయే అత్యద్భుతమైన కారును స్పెయిన్ కంపెనీ తయారు చేసింది. దీనిపేరు హిరికో. గతంలో ఎం.ఐ.టీ పేరుతో డిజైన్ అయిన ఈ కాన్సెప్ట్ కార్.. ఇప్పుడు హిరికో పేరుతో రోడ్డెక్కడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఇద్దరు కూర్చునే వీలుంటుంది. విద్యుత్ ఆధారంగా పనిచేయడంతో పొల్యూషన్ కూడా విడుదల కాదు. పట్టణాల్లో తిరగడానికి అత్యంత అనువైన కార్ అని కంపెనీ చెబుతోంది. 2013 కల్లా యూరప్ లోని 24 నగరాల్లో వీటిని అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే ఈ కారును కావల్సినప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓ సాధారణ కారు పార్కింగ్కు పట్టే స్థలంలో మూడు హిరికో కార్లను ఉంచొచ్చు. వంద కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగలిగే అవకాశం ఈ కారులో ఉంటుంది. మన కరెన్సీలో దీని ధర దాదాపు 8 లక్షలు.