20, నవంబర్ 2012, మంగళవారం

"వైట్ హౌస్" గురించి మనకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం....ఫోటోలు


వైట్ హౌస్ కు వారానికి 30,000 విసిటర్లు,65,000 లెటర్లు మరియూ రోజుకు సుమారు 2500-3500 ఫోన్ కాల్స్, 1000 ఫాక్స్ లు, 1,00, 000 ఈ-మైల్స్ వస్తాయి.
ఐర్లాండుకు చెందిన జేంస్ హోబన్ వైట్ హౌస్ ను డిజైన్ చేసేరు.
ప్రెశిడెంట్ తన కుటుంబానికి అయ్యే భోజన ఖర్చులూ మరియూ వారి ఇతర పర్సనల్ ఖర్చులకూ ఆయనే డబ్బు కట్టాలట. దీనికోసం ఆయనకు నెలకు ఒక సారి బిల్లు వస్తుంది.
మొత్తం 55,000 చదురపు ఆదుగులలో కట్టబడిన వైట్ హౌస్ కి 6 అంతస్తులు. 132 రూములూ, 35 బాత్ రూములూ,413 తలుపులు,147 కిటికీలూ, 8 మేడమెట్లు, 3 ఎలివేటర్లు, 1 టెన్నీస్ కోర్ట్, 1 బౌలింగ్ అల్లే,1 సినిమాహాలు, 1 బాస్కెట్ బాల్ స్టేడియం, 1 స్విమ్మింగ్ పూల్ మరియూ 1 జాగింగ్ ట్రాక్ కలదు.
వైట్ హౌస్ కు పెయింట్ కొట్టాలంటే 570 గాలన్ల తెల్ల పెయింట్ కావాలి.
ఎక్జిక్యూటివ్ మాన్షన్ అని పిలువబడే ఈ భవనం ప్రెశిడెంట్ రూస్వెల్ట్ ఉన్నప్పటి నుండి వైట్ హౌస్ గా పిలువబడింది.
కార్టర్ ప్రెశిడెంట్ గా ఉన్నప్పటి నుండి కంప్యూటర్లూ లేజర్ ప్రింటర్లూ అమర్చేరు.
వైట్ హౌస్ లో 8 మంది చెఫ్ లు ఉంటారు. రోజుకు 1000 మందికి వంట చేస్తారు.
వైట్ హౌస్ ను కట్టడం అక్టోబర్ 13 శనివారం , 1792 లో మొదలుపెట్టేరు. నవంబర్ 1 శనివారం, 1800 లో మొదటి ప్రెశిడెంట్ జాన్ ఆడంస్ అక్కడకు మారేరు. ఆ రోజుల్లో శనివారాలు కూడా పనిచేసేవారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి