22, ఏప్రిల్ 2014, మంగళవారం

ఎమ్మార్ సంగతేంది?

ఎమ్మార్ సంగతేంది?
Emaar-‘రియల్’ కబ్జాపై పోరుకు సన్నద్ధం
-మా భూములు మాగ్గావాలె..
-బ్రహ్మణి తరహాలో జీవోలు రద్దు చేయాలి.. బాధిత రైతుల డిమాండ్

-రాజధానిలో సీమాంధ్ర పాలకుల భూ బాగోతం
-హైటెక్ పేరిట ఎమ్మార్‌కు బాబు గులాంగిరీ.. వంతపాడిన వైఎస్
-దుబాయ్ కంపెనీతో టెండర్
-తన వద్ద డబ్బులేదని మరో కంపెనీని సృష్టించిన ఎమ్మార్
-కోటి విలువచేసే ఎకరం.. రూ. 29లక్షలకే బొక్కేశారు!
-చదరపు గజం విల్లాలను రూ. 50వేలకు అమ్ముకున్నారు!
-కేటాయింపు 535 ఎకరాలు.. వినియోగించింది 235 ఎకరాలే
-మిగిలిన 300 ఎకరాలు తిరిగిచ్చేయండి... బాధితుల పట్టు


దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. సీమాంధ్ర పాలకులు తెలంగాణ భూములు పంచుకున్నారు..! అభివృద్ధి పేరిట దొంగ నాటకాలకు తెరలేపి.. హైదరాబాద్ శివారులో ఎకరం కోటి విలువ చేసే భూమిని కారుచౌకగా కొట్టేశారు..! ఇటు పాలకులతో పాటు అటు అధికారులూ భూబాగోతానికి పక్కా వ్యూహం రచించారు. దేశంకాని దేశం నుంచి ఎమ్మార్ కంపెనీని తెరపైకి తెచ్చి దానితో కథ నడిపించారు. పచ్చని భూములకు హైటెక్ హంగులు అద్దుతున్నట్లు చెప్పి.. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటళ్లు, గోల్ఫ్ కోర్స్, విలాసవంతమైన టౌన్ షిప్‌లకు పునాదులు వేశారు..! పాలకుల వ్యాపారాన్ని పసిగట్టిన ఆ కంపెనీ తానేమీ తక్కువ తినలేదంటూ కొత్త స్క్రిప్ట్ రచించింది..! ప్రభుత్వానికే ముచ్చెమటలు పట్టించేలా ఆ స్క్రిప్ట్‌తో పునాదులపై నాటకాలు వేసింది..! తన వద్ద డబ్బులు లేవని, మరో కంపెనీని తెరపైకి తెచ్చింది.. ప్రభుత్వానికి దక్కాల్సిన లాభాల వాటాను కూడా దక్కకుండా చేసింది..! విల్లాల్లో చదరపు గజాన్ని రూ. 5వేలకు విక్రయించాల్సి ఉండగా సుమారు రూ. 50వేలకు బడాబాబులు విక్రయించేశారు.

లెక్కల్లో మాత్రం రూ. 5 వేలు అని రాశారు..! వారిలో ఇప్పటికే కొందరు సీబీఐ వలకు చిక్కారు..! ఊచలు లెక్కిస్తున్నారు..! ఇంకొందరు ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు..! వారి ఆగడాలకు బలైంది తెలంగాణ రైతులు..! తెలంగాణ భూములు..! హైదరాబాద్ శివారులోని మణికొండ, నానక్‌రామ్‌గూడ, పుప్పాల్‌గూడ పల్లెలు..!! పాలకుల ‘పైసా’చికంపై.. ఎమ్మార్ బాగోతంపై ఇప్పుడు ఆ పల్లెల ప్రజలు సమరానికి సన్నద్ధమవుతున్నారు. ‘మా భూములు మాగ్గావాలె’ అంటూ పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. గాలి జనార్దన్‌డ్డి గారాల పట్టి ‘బ్రహ్మణి స్టీల్’కు కడప జిల్లాలో కేటాయించిన భూముల తాలూకు జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి న ఎమ్మార్‌కు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్ కాన్సెప్ట్ తనదేనని గొప్పలు చెప్పుకుంటున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. అందుకు వంతపాడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖడ్డిల పాత్రపై నిగ్గు తేల్చాలంటూ పట్టుబడుతున్నారు..!!

హైదరాబాద్, జూన్ 3 (టీ న్యూస్):ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేయాలంటే ఎలా అని సీమాంధ్ర పాలకుల్లో మెదిలిన ఆలోచనల్లోంచి పుట్టిందే ఎమ్మార్..! హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో పేదల చేతుల్లో ఉన్న వందల ఎకరాలను లాక్కునేదెలా? అంటూ పక్కా పన్నాగం పన్నారు. ఇదే ఆలోచన సాధారణ కబ్జాకోరుకు వస్తే భూ యజమానులను బెదిరించి భూములు ఆక్రమించుకునేవాడు. కానీ పేదల పుట్టిముంచడంలో ఆరితేరిన ఉద్ధండ నాయకులు, అధికారులు ఓ పకడ్బందీ పథకం రచించారు. తామే ప్రభుత్వం అయినప్పుడు అధికారికంగా కబ్జా చేస్తే సరిపోదా? అన్న కుట్రను అమలు చేశారు. అంతే.. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. ఇందుకు ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని పావుగా వాడుకున్నారు. పరిక్షిశమల కోసం భూముల్ని, మౌలిక సదుపాయాలు కల్పించే ఈ సంస్థను తమ రియల్ ఎస్టేట్ దందాకు బ్రోకర్‌గా మార్చారు. చివరకు ఈ సంస్థనే ఏమార్చి వేల కోట్ల విలువైన పేదల భూముల్ని కాజేశారు.

ఇలా మొదలైంది....
మణికొండ, నానక్‌రామ్‌గూడ, పుప్పాల్‌గూడల్లోని వందల ఎకరాల భూముల్ని అభివృద్ధి చేయాలంటూ 2002లో అప్పటి చంద్రబాబు సర్కారు ఓపెన్ టెండర్‌ను పిలిచింది. ఇందులో భాగంగా దుబాయ్‌కు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. ఇక అసలు కథ ఆరంభమైంది. 2002లో సెప్టెంబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ఎమ్మార్ ప్రాపర్టీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఏపీఐఐసీ 535 ఎకరాలను ఎమ్మార్‌కు కట్టబె సిద్ధమైంది. ఈ భూముల్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటళ్లు, గోల్ఫ్ కోర్స్, విలాసవంతమైన టౌన్ షిప్‌లను ఏర్పాటు చేస్తామని ఎమ్మార్ తెలిపింది. ఈ ప్రాజెక్టును రెండు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీ)గా ప్రకటించారు. ఎస్‌పీవీ-1లో గోల్ఫ్ కోర్స్, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో ఎమ్మార్ ప్రాపర్టీస్ లాభాల వాటా 74 శాతం కాగా ప్రభుత్వం(ఏపీఐఐసీ) వాటా 26%. ఇక ఎస్‌పీవీ-2లో కన్వెన్షన్ సెంటర్, హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఏపీఐఐసీ లాభాల వాటా 49 శాతం కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు 51 శాతం వాటా ఉంది.

తొలివిడతగా ఎస్‌పీవీ-1ను చేపట్టారు. ఇందుకోసం నానక్‌రామ్ గూడలోని 258 ఎకరాలను ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు అప్పగించారు. అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం కోసం ‘ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్’ (ఈహెచ్‌టీటీ) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక ఎస్‌పీవీ-2 కింద చేపట్టాల్సిన హోటల్, కన్వెన్షన్ సెంటర్ కోసం ‘బౌల్డర్ హిల్స్ లీజర్ ప్రైవేట్ లిమిటెడ్’,‘ సైబరాబాద్ కన్వెన్షన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలను ఏర్పాటు చేశారు. వీటికి 267 ఎకరాలను కేటాయించారు. 2005లో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైఎస్ రాజశేఖర్‌డ్డి అధికారంలోకి వచ్చారు. ఇక ఆయన ‘ఎమ్మార్’పై తన మార్కును ప్రదర్శించారు. ఎస్‌పీవీల సంఖ్యను మూడుగా మార్చి ఏపీఐఐసీ లాభాల వాటాను అన్నింట్లోనూ 26 శాతానికి కుదించారు. అయితే అప్పట్లోనే భూముల సేకరణపై రైతుల నుంచి ఆందోళన తీవ్రమవడంతో ఎకరానికి రూ.26 లక్షల చొప్పున అప్పగిస్తున్న పరిహారాన్ని రూ.29 లక్షలకు పెంచారు.

ఎంజీఎఫ్ రంగవూపవేశం...
ప్రభుత్వం తన వ్యాపార దృక్పథాన్ని ముందుగానే ప్రకటించి టెండర్లు పిలవగా, ఇందుకు అనుగుణంగానే టెండర్లు దక్కించుకున్న ఎమ్మార్ సంస్థ తన నాటకాల్ని ప్రారంభించింది. టెండర్లు దక్కించుకున్నదే విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం కాగా, వీటి నిర్మాణాలకు తమ వద్ద డబ్బులేదంటూ మరో సంస్థను సృష్టించింది. ఎమ్మార్-ఎంజీఎఫ్ పేరిట నెలకొల్పిన ఈ సంస్థ ఎమ్మార్‌కు డూప్‌గానే పరిగణించాల్సి ఉంది. ఎందుకంటే ఈ రెండు సంస్థలకూ సీఈఓ ఒక్కరే కావడం గమనార్హం. ఇలా ఎమ్మార్-ఎంజీఎఫ్ సృష్టి వెనుక పలువురు ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనేది ప్రస్తుతం కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. ఏపీఐఐసీని ఏమార్చేందుకే ఎంజీఎఫ్‌ను సృష్టించారని స్వయంగా ఏపీఐఐసీ పెద్దలే పలుమార్లు చెప్పడం గమనార్హం. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములను ఎమ్మార్ ప్రాపర్టీస్.. ఎమ్మార్ ఎంజీఎఫ్‌కు బదలాయించింది. ఈ బదలాయింపు విషయంలో ఏపీఐఐసీని పూర్తిగా పక్కనబెట్టింది. దీంతో 2,850 కోట్ల విలువైన భూములు ఎంజీఎఫ్ ఆధీనంలోకి వెళ్లాయి. ఇక్కడ నిర్మించే విల్లాలపై గుత్తాధిపత్యం ఈ సంస్థకే దక్కుతుంది.

ఈ తతంగం వల్ల ఎమ్మార్‌లో ప్రభుత్వం వాటా 26 శాతం నుంచి ఏకంగా 6 శాతానికి పడిపోయింది. మొత్తం 150 విల్లాల నిర్మాణం ఆరంభమైంది. వీటిని గజానికి గరిష్టంగా 50వేల చొప్పున విక్రయించింది. తద్వారా సుమారు రూ.750 కోట్లు ఎంజీఎఫ్‌కు దక్కింది. ఇక మరో 2000 హై ఎండ్ అపార్ట్‌మెంట్ల ద్వారా మరో రూ.750 కోట్లు గడించింది. అయితే ఈ అపార్ట్‌మెంట్లు, విల్లాలు వాస్తవ ధరలను భారీగా తగ్గించి లెక్కలు చూపింది. దీంతో ఏపీఐఐసీకి దక్కాల్సిన వాటా మరింత తగ్గింది. చివరకు ఏపీఐఐసీ వాటా ఇందులో నామమావూతంగా తయారైంది. ఈ తతంగం గురించి తెలిసినా పలువురు ప్రభుత్వ పెద్దలు, అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. చివరకు 2010లో ఏపీఐఐసీలో కీలక బాధ్యతలు చేపట్టిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చొరవతో ఈ కుట్ర బయటకు పొక్కడం ఆరంభమైంది. దీన్ని మరింత బహిర్గతం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్‌రావు లేఖ రాయగా, స్పందించిన హైకోర్టు విచారణకు ఆదేశించడంతో ఎమ్మార్ పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిందితులు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బాధితులకు దక్కాల్సిన న్యాయంపై ఎవరూ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. దొంగలు దొంగలు కలిసి పేదల భూముల్ని దోచుకున్నారు. దోచుకున్నవారి అక్రమాలపైనే విచారణ సాగుతోంది కానీ, దోపిడీకి గురైన విలువైన భూమి హక్కుదారులకు న్యాయం జరగడం లేదు. తమ భూములు తిరిగి తమకే అప్పగించాలని వారు గింజికుంటున్నా పాలకులు ఏమాత్రం స్పందించడం లేదు..!!

ఎవరిని శిక్షించాలి?: ఊరి చివరన తాత ముత్తాతలు ద్వారా సంక్రమించిన భూముల్ని సాగు చేసుకుంటున్న అమాయక జనాన్ని ఆ భూముల నుంచి తరిమేసిన వారికి ఏ శిక్ష వేయాలి? ఈ భూముల్లో రేసుకోర్సులు, విల్లాలు నిర్మించి ఇవ్వండి అని ఇక్కడివారేమైనా అడిగారా? ఈ విల్లాలు, హోటళ్ల నిర్మాణం వల్ల ఇక్కడి ప్రజలకు ఒరిగేదేమిటి? ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్మాణాలు చేపట్టారు? అనే బాధిత రైతుల ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేదు. సీబీఐ విచారణతో భుజాలు తడుముకున్న ఎమ్మార్‌పైనే ఇంకా కనికరం కల్పించడంలో ఉద్దేశాలు ఏమిటి? తమ ద్రోహాన్ని బాహటంగా ఒప్పుకొని మరీ ఏపీఐఐసీకి లేఖ రాసిన ఎమ్మార్‌ను క్షమించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతూ ఉండటంలో మతలబేమిటి? అని బాధితులు నిలదీస్తున్నారు. ఎమ్మార్‌లో అక్రమాలు నిజమే అని ద్రోహానికి పాల్పడ్డవారు ఒప్పుకుంటున్నారు.. ఈ ద్రోహాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేయడంలో దర్యాపు సంస్థా తన వంతు పని కానిస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఎమ్మార్ అక్రమాలను సమర్థించే పరిస్థితి లేదు. అయినప్పటికీ ప్రభుత్వం బాధితులకు ఆ భూముల్ని తిరిగి అప్పగించాలనే డిమాండ్‌ను ఏమాత్రం పరిగణించకపోవడం దారుణం..! ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా మిగిలిపోయిన 300 ఎకరాల భూముల్ని కూడా తన వద్దే అట్టిపెట్టుకోవడంలో మతలబేమిటో ప్రభుత్వ పెద్దలు తేల్చాల్సిన అవసరం ఉందని భూమి హక్కుదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఎకరం కోటి.. కానీ ఇచ్చింది రూ. 29లక్షలే!
2002లో మణికొండ, నానక్‌రామ్‌గూడ, పుప్పాల్‌గూడలో ఎకరం భూమి కోటి పలికేది..! కానీ ఎమ్మార్ కోసమని నాటి బాబు సర్కారు రైతుల నుంచి 300 ఎకరాల భూమిని కేవలం ఎకరం రూ. 26లక్షలు చెల్లించి తీసుకుంది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ సర్కారు అదనంగా మరో మూడు లక్షలు ఇస్తామని చెప్పి దాన్ని రూ. 29లక్షలు చేసింది. ఎమ్మార్ కాన్సెప్ట్ తనదేనని గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. తాజాగా అక్రమాలు వెలుగుచూస్తున్నప్పుడు కూడా బాధిత రైతుల పక్షాన నిలవడం లేదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

ఒకరొకరిగా దొరికిపోతున్న అక్రమార్కులు!
ఎమ్మార్ అక్రమాలపై సీబీఐ దృష్టి సారించడంతో అక్రమార్కులు ఒకరొకరిగా వెలుగులోకి వస్తున్నారు. ప్రతిపాదన ప్రకారం రూ. 5వేలకు చదరపు గజం విల్లాలను విక్రయించాల్సిందిపోయి.. రూ.50 వేల వరకు విక్రయించి లెక్కల్లో మాత్రం రూ. 5వేలు రాసి ఇప్పటికే పలువురు పెద్దలు సీబీఐ వలలో చిక్కారు. ఈ దందాలో అక్రమాలకు పాల్పడ్డారన్న నెపంతో ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, కోనేరు ప్రసాద్ తదితరులు జైలు ఊసలు లెక్కిస్తున్నారు. ఇంకా లెక్కలు తేలితే అందరి గుట్టు రట్టవుతుందని పాత్రధారులు భయపడుతున్నారు.

సర్కారు దాహానికి రైతులు బలి!
చంద్రబాబు సర్కారు దాష్టీకానికి మణికొండ జాగీర్‌లోని దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు రెండువందల కుటుంబాలు బలయ్యాయి. సేద్యం చేసి పది మందికి అన్నం పెట్టే రైతులు.. బాబు పుణ్యమాని కూలీలుగా మారారు. ఎకరం కోటి రూపాయలు విలువ చేసే భూమిని లాక్కున్న నాటి సర్కారు.. ఈ భూమి మీది కాదని, కేవలం మీరు కాస్తు కారులేనని పేర్కొంటూ ఎకరాకు రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని చెక్కులు పంపింది..! ఎమ్మార్ గోల్ఫ్‌కోర్సులో తమ జీవితాలను చంద్రబాబు సమాధి చేస్తున్నాడని గ్రహించిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం తన అవసరాల కోసం రైతుల నుంచి భూమిని సేకరిస్తే, మార్కెటు ధర ప్రకారం చెల్లింపులు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయినా సీమాంధ్ర పాలకులు స్పందించ లేదు. ప్రతిపక్షంలో నుంచి పాలక పక్షంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరడ్డి కూడా పట్టించుకోలేదు. బడాబాబులకే పెద్దపీట వేశారు. పదేళ్లుగా మణికొండ, పుప్పాల్‌గూడ, నానక్‌రామ్‌గూడ రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ భూమే జీవితమని నమ్ముకొని బతికిన అన్నదాతలు.. ఇప్పుడు కూటికోసం విలవిలలాడుతున్నారు.

పచ్చని భూముల్లో ‘పెద్దల’ జల్సా
రైతుల నుంచి విలువైన భూములను స్వాధీనం చేసుకొని ఎమ్మార్‌కు అప్పగించిన సర్కారు.. ఆ తర్వాత నుంచి భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేసింది. వాస్తవంగా ఇంటిక్షిగేటెడ్ ప్రాజెక్టు కోసం ఆనాడు ప్రతిపాదించింది కేవలం 250 ఎకరాలే..! ఈ మేరకు నాడు ప్రకటనలు కూడా ఇచ్చింది. ఈ మేరకే అయితే అక్కడే ఉన్న 200 ఎకరాల సర్కారు భూమికి తోడు మరో 50 ఎకరాల రైతుల భూమిని మాత్రమే సేకరిస్తే సరిపోయేది.. కానీ విల్లాలు కట్టి రియల్ వ్యాపారం చేయడానికి మరో 250 ఎకరాల భూమిని నాటి పాలకులు చక్రం తిప్పినడిపారు. ఈ మేరకు నోట్‌ఫైల్స్ కూడా ఉన్నాయి. గోల్ఫ్ కోర్సు కోసం మొదట రూపొందించిన ఇంటిక్షిగేటెడ్ ప్రాజెక్టుకు విల్లాలు నిర్మించాలన్న రియల్ ఎస్టేట్ కాన్పెస్ట్ తోడు కావడంతో భారీ ఎత్తున రైతుల భూములు లూటీ చేశారు. మొత్తం 535 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నడిపిన పెద్దలంతా కోట్లాది రూపాయల విలువ చేసే విల్లాలు కైవసం చేసుకున్నారు.

భూములు తిరిగి ఇచ్చే అవకాశం ఉన్నా..!
ఎమ్మార్‌లో ఇప్పటికీ 300 ఎకరాల భూమి వినియోగంలోకి రాలేదు. చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా 535 ఎకరాలను ఎమ్మార్‌కు కేటాయించింది. ఈ భూములు ఎమ్మార్ స్వాధీనంలోకి వెళ్లి పదేళ్లవుతోంది. అందులో 300 ఎకరాల భూమిని వినియోగించకపోవడంతో.. తిరిగి తమకే ఇచ్చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రియల్ దందాకు ఇచ్చేందుకు పెద్దలు పన్నాగం పన్నుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూమిని రైతులకు ఇస్తే కనీసం ఈ సర్కారు రైతుల పక్షాన ఉందన్న అభివూపాయం ప్రజల్లో కలుగుతుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అన్నారు. కడప జిల్లాలో బ్రహ్మణి స్టిల్స్‌కు కేటాయించిన భూములను సర్కారు ఏ విధంగానైతే వెనక్కు తీసుకుందో అదే పద్ధతితో ఎమ్మార్ నుంచి వెనక్కు తీసుకొని రైతులకు ఇచ్చేయవచ్చన్నారు. వాస్తవంగా ఎమ్మార్‌కు ఇచ్చిన 535 ఎకరాలలో రైతుల భూమి 300 ఎకరాలు మాత్రమే.. ప్రస్తుతం 300 ఎకరాల భూమి ఎమ్మార్‌లో ఖాళీగా ఉంది. ఈ భూమిని బాధిత రైతులకే అన్ని హక్కులతో వాపస్ చేస్తే వారు ఈ సమాజంలో గౌరవంగా బతికే అవకాశం కలుగుతుందని వివిధ సంఘాల నేతలు అంటున్నారు. ప్రజావూపయోజనం కోసం వివిధ సంస్థలకు కేటాయించిన భూములను ఆయా సంస్థలు వినియోగించుకోలేకపోతే తిరిగి తీసుకునే సర్కారు... సీమాంధ్ర రైతులకు చెందిన భూములకు (వూబహ్మణి విషయంలో) ఒక న్యాయం..తెలంగాణ రైతులకు చెందిన భూములకు మరొక న్యాయం అమలు చేస్తోందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి