Sakshi | Updated: September 27, 2014 18:03 (IST)
ఈకేసుకు సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి..
- 1996 జూన్లో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు
- విచారణ జరపాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశాలు జారీచేసింది
- జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్ లో ఛార్జిషీటు దాఖలు చేశారు
- అక్టోబర్ లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి
- 2002 మార్చిలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు
- 2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు
- విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
- దాంతో 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
- 2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
- 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు.
- 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు
- 2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జి.భవానీసింగ్ నియమితులయ్యారు
- దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాకట కోర్టు భవానీసింగ్ ను తప్పించింది.
- తనను తప్పించడంపై భవానీసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
- ఈలోపు ప్రత్యేక కోర్టు జడ్జి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు.
- కొత్త జడ్జిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు.
- 2014 ఆగస్టులో విచారణ పూర్తయింది.
- తీర్పును వాయిదా వేయాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు
- అది కుదరదని, 27నే తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- పరపన అగ్రహారంలోని గాంధీభవన్ లో ప్రత్యేక కోర్టు ఉంది.
- 1996లో తన దత్తపుత్రుడు సుధాకర్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుచేశారన్నది ప్రధాన ఆరోపణ
- 2014 సెప్టెంబర్ 27 వ తేదీన ఆమెకు నాలుగేళ్లు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
- షీలా బాలకృష్ణన్ ను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి