4, జనవరి 2013, శుక్రవారం

కడ్తాల్ పిరమిడ్ కహానీ ఇది.. రియల్‌ధ్యానం!


thata
ఇక్కడ ఇళ్లు ఉంటే మంచిదంటూ ప్రచారం
ప్రముఖులను పిలిచి నమ్మించే యత్నాలు.. 
ఇప్పటికే వందల ఎకరాల సేకరణ
- ధ్యాన మహాసభలు రియల్ వృద్ధికే!
- అట్టహాసంగా ధ్యాన మహాసభల ఏర్పాట్లు
- ఇకపై ఏటా మహాసభలంటున్న నిర్వాహకులు
- శంషాబాద్‌కు సమీపంలో కడ్తాల్ గ్రామం
- అందుకే ఈ భూములపై రియల్ కన్ను
- కారుచౌకగా కొని.. కోట్లకు అమ్మే పన్నాగం!
- చెరువును పూడ్చి.. పార్కింగ్ సదుపాయం
- అటవీ, శిఖం భూముల్లో ఆక్రమణలు
- విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

(టీ మీడియా - హైదరాబాద్): శంషాబాద్ విమానాక్షిశయానికి అతి దగ్గరలో ఉన్న ఈ గ్రామంలో ధ్యాన మహాసభలు ఏర్పాటు చేయడం వెనుక స్థానిక రియల్‌వ్యాపారుల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కడ్తాల్ గ్రామం హైద్రాబాద్ ఐబీఎస్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రధానంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు 30 నుంచి 40 కిలోమీటర్ల లోపే. ఎయిర్‌పోర్టులో విమానం దిగి, అరగంటలో కడ్తాల్ చేరుకునే వీలుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వ్యాపార లబ్ధి కోసం కొత్త ఆలోచనలకు తెరలేపారు. అదే పిరమిడ్ నిర్మాణం. ప్రస్తుతం మహేశ్వర పిరమిడ్ ట్రస్టులో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న ఒకరికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. అన్మాస్‌పల్లి గ్రామానికి చెందిన ఆ వ్యాపారి కడ్తాల్ సమీపంలో రియల్ ఎస్టేట్ దందాను కొత్త పుంతలు తొక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని అంటున్నారు. పత్రీజీ అనే స్వామితో సంబంధాలు ఏర్పర్చుకోవడం, కడ్తాల్ సమీపంలో పిరమిడ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడం చకచకా జరిగిపోయాయి. కడ్తాల్ పిరమిడ్ నిర్మాణం వెనుక దాదాపు 20 మంది వరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు వస్తున్న సమాచారమే విస్తుగొల్పుతున్నది. కడ్తాల్ చుట్టు ప్రక్కల వేల ఎకరాలను ట్రస్ట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. వీటిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్చి.. పిరమిడ్ పేరుతో భూముల ధరలకు రెక్కలు తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ప్రశాంత జీవనం కొరకు... ధ్యానం...
పలు రకాల సమస్యలతో సతమతమవుతున్న జనం ప్రశాంత జీవనం కోసం చూస్తున్నారు. ఈ బలహీనతను అడ్డం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్ల రూపాయలు ఆలవోకగా సంపాదించేందుకు ప్రణాళికను అమల్లో పెట్టారు. కడ్తాల్ సమీపంలో ప్రపంచ స్థాయి పిరమిడ్ ఏర్పాటు చేస్తే.. ఇక్కడి భూములకు రెక్కలోస్తాయనే ఆలోచనతో పావులను కదిపారు. అన్మాస్‌పల్లి సమీపంలో ఫారెస్ట్ భూములకు పక్కగా ఉన్న వ్యవసాయ పొలాలను సేకరించారు. రైతులను నయానో, భయానో ఒప్పించి దాదాపు 50 నుంచి 60 ఎకరాల భూమి సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోనే ఛౌడమ్మ అనే చెరువు ఉంది. సర్వే నెంబర్ 274లో దాదాపు 15 ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. చెరువు ఎలాగూ అసైన్డ్‌లో ఉంటుంది కాబట్టి.. దాన్ని కూడా కబ్జా చేసేందుకే ఇక్కడ భూములను సేకరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చకచకా పిరమిడ్ నిర్మాణం....
ప్రపంచస్థాయి ధ్యాన మహాసభలు కడ్తాల్‌లో 11 రోజుల పాటు నిర్వహిస్తున్నామని విస్తృతంగా ప్రచారం చేశారు. 180 వెడల్పు, 180 మీటర్ల ఎత్తులో పిరమిడ్ నిర్మాణాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. చుట్టు పక్కల బృందావన్ గార్డెన్‌ను తలపించే రీతిలో పూలమొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. చివరకు ప్రపంచ ధ్యాన మహాసభలు ప్రారంభం రోజు రానే వచ్చింది. ముందుగానే విపరీతంగా ప్రచారం ఉండటంతో లక్షల్లో జనాలు వచ్చారు. వారికి ఉచితంగా భోజన వసతి కల్పించారు. ప్రపంచ స్థాయి కళాకారులతో సాంస్కృతిక కార్యక్షికమాలు వైభవోపేతంగా నిర్వహించారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను తీసుకువచ్చారు. న్యాయమూర్తులు, గవర్నర్ రోశయ్య, రాష్ట్రపతి కూతురు, కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలు, అధికారులు ఇలా ప్రముఖులను పెద్ద సంఖ్యలో తీసుకురావడంతో మరింత ప్రచారం పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసినా.. భద్రతా కారణాల వల్ల వారు రాలేదు. ఇదంతా తమపై జనంలో నమ్మకాన్ని పెంపొందించుకునే చర్యేనన్న విమర్శలు వస్తున్నాయి.

రియల్ ఏస్టేట్ దందాకు లేసిన తెర....
పిరమిడ్ ప్రాంతంలో ధ్యానంతో ఎంతమందికి ప్రశాంతత లభించిందో తెలియదు కానీ, 11 రోజుల కాలంలోనే రియల్ ఎస్టేట్ దందాకు మాత్రం ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. ప్రపంచ స్థాయిలో పిరమిడ్ ప్రాంతంలో కార్యక్షికమాల నేపథ్యంలో దేశ, విదేశీయుల దృష్టి కడ్తాల్ గ్రామంపై, సమీప భూములపై పడింది. దీనికితోడు పిరమిడ్‌లో ధ్యానం చేస్తే అనంతమైన శక్తి వస్తుందని ప్రచారం చేశారు. కడ్తాల్ సమీపంలో ఇల్లు ఉంటే, సంవత్సరంలో ఒకటి, రెండు నెలలు అక్కడ ఉండి, పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటే శారీరకంగా, మానసికంగా బలంగా ఉండవచ్చునని జనంతో నమ్మించారు. ఒక రకంగా చెప్పాలంటే ధ్యానం ముసుగులో మనిషిలో బలహీనతను సొమ్ము చేసుకునేందుకు రియల్ ఏస్టేట్ వ్యాపారులు కుట్ర పన్నారన్న విమర్శలు ఉన్నాయి. 

పిరమిడ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో...
ధ్యాన మహాసభల సందర్భంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన బ్యానర్లే కనిపిస్తుండటం విశేషం. అంతేకాదు.. పిరమిడ్ ప్రాంగణంలో పలు రియల్ వ్యాపారాల తాత్కాలిక కార్యాలయాలు వెలిశాయి. ప్రాంగణంలో రియల్ బ్రోచర్లు పంచుతున్నారు. అడ్వాన్స్‌గా ప్లాట్లను బుక్ చేసుకుంటే కలిసి వస్తుందని, లేదంటే కోట్లు చెల్లించినా ఈ ప్రశాంత వాతావరణంలో గజం స్థలం కూడా రానున్న రోజుల్లో దొరకేవీలు లేదని మభ్యపెడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి బాగా డబ్బు ఉన్నవారు వచ్చిన నేపథ్యంలో వారు ప్లాట్ల కొనుగోలుకు పోటీలు పడినట్లు తెలుస్తోంది. 

ప్రపంచ ధ్యాన మహాసభల్లో....
ధ్యాన మహాసభలు సాగుతుండగా మధ్యలో ఒక ట్రస్టు సభ్యుడు పిరమిడ్ గొప్పతనాన్ని వివరిస్తూ 150 ఎకరాల్లో పెద్ద సినిమా థియేటర్, ఏసీ కాన్ఫన్స్ హాల్, పత్రీజీ నివాసం ఉండేందుకు సర్వ హంగులతో ఒక ఇల్లుతో పాటు ఇతర విల్లాలు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రతి ఏటా శ్రీ మహేశ్వర పిరమిడ్ ప్రాంగణంలో ప్రపంచ ధ్యాన మహాసభలు జరుగుతాయని, వచ్చే ఏడాది నుంచి 21 రోజుల పాటు మహాసభలు నిర్వహిస్తామని చెప్పడం చూస్తుంటే.. దీని వెనుక పెద్ద తతంగమే ఉన్నట్లు అర్థమవుతున్నదని పలువురు అంటున్నారు. ధ్యాన మహాసభలకు హాజరైన వారిలో కొందరు చుట్టు పక్కల గ్రామాల్లో, తండాల్లో వేల రూపాయలు పోసి గదులు అద్దెకు తీసుకున్నారు.
real
చెరువులో రోడ్ల నిర్మాణం...
పూర్తి స్థాయిలో అక్రమణలు లేకున్నా చెరువును చదును చేసి, పార్కింగ్‌గా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతానికైతే పట్టా పొలంలోనే పిరమిడ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. అటవీ శాఖ స్థలంలో గుడారాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అధికారులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే... ఎక్కడ ఏ విధంగా ఆక్రమణ జరిగిందనే విషయం తెలిసే వీలుందని పలువురు చెబుతున్నారు. 

పత్రీజీకి మగాళ్లంటే మహాచిరాకు!
పిరమిడ్ నిర్మాణాల కర్త సుభాష్ పత్రీజీకి మగాళ్లంటే మహామంట. దగ్గరికి వస్తే దూరం దూరం అంటూ నెట్టేస్తాడు. అవసరమైతే చేయి చేసుకుంటాడు. అదే అమ్మాయిలైతే ఆహ్వానిస్తూ, కౌగిలించుకుంటాడు. ముద్దులు కురిపిస్తాడు. వాళ్ళపైన చేతులేస్తాడు. బ్రహ్మర్షి మహాయోగి అని భావించిన అబలలు ఆయన ఆశీర్వాదం కోసం తహతహలాడతారు. ఓసేయ్, ఓరేయ్ అనేవి ఆయన సహజపదాలు. దగ్గరకు పిలిచి నెత్తిన కొడతాడు. చిన్న పిల్లాడిలా మరోవైపు, మహా వేదాంతిలా ఇంకోవైపు మాట్లాడే పత్రీజీ వైఖరిపై ధ్యాన మహాసభల్లో కూడా నిరసనలు వ్యక్తమైన సందర్భాలు ఉన్నాయి. ఆడోళ్లు అయితేనే దగ్గరికి రానిస్తాడంటూ పలువురు సభా ప్రాంగణంలోనే గుసగుసలాడుకున్నారు.

సెలెవూబిటీలను రప్పించడంలో...
మహేశ్వర పిరమిడ్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తేచ్చేందుకు దాని నిర్వాహకులుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రి జైపాల్‌డ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల మంత్రి సుదర్శన్‌డ్డి, హైకోర్టు న్యాయమూర్తులు ఈశ్వరయ్య, వెంక ఎంతో మంది ఐఏఎస్‌లు, జిల్లా మేజిస్ట్రేట్‌లు, ఎమ్మెల్యేలు ధ్యాన సభలకు ఆహ్వానితులుగా హాజరై పత్రీజీని ప్రశంసల్లో ముంచెత్తారు. సినీ నటుడు జగపతిబాబుతో పాటు ఇతర బుల్లితెర తారాగణం కూడా వచ్చింది. 

విచారణకు కలెక్టర్ ఆదేశాలు
పిరమిడ్ ధ్యాన కేంద్రం కోసం జరిగిన భూ ఆక్రమణలపై వెంటనే విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. పిరమిడ్ ధ్యాన కేంద్ర ఏర్పాటుకు సంబంధించి 260, 266 సర్వే నంబర్లలో ఉన్న చెరువును పూడ్చి, అటవీ ప్రాంతాన్ని చదును చేయడంతో పాటు ప్రభుత్వ, శిఖం భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇందుకుగాను ఆర్డీవో వెంక విచారణ అధికారిగా నియమించారు. భూములకు సంబంధించిన పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించి అసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ప్రస్తుతానికైతే... ఎలాంటి ఆక్రమణలు లేవు: ఆర్డీవో
‘పిరమిడ్ పట్టా పొలంలోనే నిర్మించారు. చెరువులో తాత్కాలికంగా రోడ్లు వేశారు. చెరువును పార్కింగ్‌గా ఉపయోగించుకున్నారు. అధికారులతో కలిసి రెండు రోజుల్లో సర్వే చేసి, వాస్తవాలను బహిర్గత పరుస్తాం’ అని మహబూబ్‌నగర్ ఆర్డీఓ వెంక తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి